నో కాంప్రమైజ్‌ | Saaho Released on august 30 | Sakshi
Sakshi News home page

నో కాంప్రమైజ్‌

Jul 20 2019 12:52 AM | Updated on Jul 20 2019 7:36 AM

Saaho Released on august 30 - Sakshi

ప్రభాస్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సాహో’. సుజీత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్‌లు నిర్మించారు. తొలుత ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయాలనుకున్నారు. గ్రాఫిక్స్‌ వర్క్‌ ఎక్కువగా ఉండటంతో ఈ సినిమాను పదిహేను రోజులు ఆలస్యంగా ఆగస్టు 30న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘‘ఇప్పటివరకు మా బ్యానర్‌లో వచ్చిన సినిమాలన్నీ క్వాలిటీకి కేరాఫ్‌గా నిలిచాయి. ‘సాహో’ చిత్రాన్ని కూడా అలాగే తీర్చిదిద్దుతున్నాం. ‘బాహుబలి’ వంటి సూపర్‌ సక్సెస్‌ తర్వాత ప్రభాస్‌ నటించిన ‘సాహో’ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్‌ కావడం ఇష్టంలేదు. కొంచెం ఆలస్యమైనా బెస్ట్‌ క్వాలిటీతో విజువల్స్‌ని ప్రేక్షకులకు అందించాలనుకుంటున్నాం. అందుకే ‘సాహో’ చిత్రాన్ని ఆగస్టు 30న విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాతలు తెలిపారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో శ్రద్ధాకపూర్‌ కథానాయికగా నటించారు.

Advertisement
 
Advertisement
Advertisement