అలాంటిది ఏమీ లేదు

Rumors on Sai Pallavi's relationship with noted director go viral - Sakshi

చెన్నైలో ఓ పుకారు మొదలైంది. కొన్ని నిమిషాల్లోనే అది ఇంతింతై ఎంతెంతో దూరం వెళ్లిపోయింది. అదేంటంటే.. తమిళ దర్శకుడు ఏఎల్‌ విజయ్, నటి సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతున్నారని. ఆ విషయాన్ని క్లారిఫై చేసుకోవడానికి విజయ్, సాయి పల్లవితో వర్క్‌ చేసినవాళ్లను సంప్రదించగా ఈ వార్తలను కొట్టిపారేశారు.  ‘మదరాస పట్టిణమ్, దైవ తిరుమగళ్‌ (తెలుగులో నాన్న), దేవి (అభినేత్రి), దియ (కణం)’ వంటి సినిమాలను తెరక్కించారు ఏఎల్‌ విజయ్‌. 2016లో విజయ్, అమలా పాల్‌ పెళ్లి చేసుకున్నారు.

2017లో డైవర్స్‌ తీసుకున్నారు. గత ఏడాది ‘దియ’ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటించారు. ఆ సినిమా టైమ్‌లో వీరి మధ్య స్నేహం ఏర్పడిందట. ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్‌ చేస్తున్నారని, త్వరలోనే పెళ్లికూడా చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని, ఈ విషయాన్ని కొన్ని రోజుల్లో ప్రకటించాలను కుంటున్నారు’ అన్నది ప్రచారంలో ఉన్న వార్తల సారాంశం. ‘‘అటువంటిదేం లేదు. ఈ వార్త ఎక్కడ నుంచి వచ్చిందో ఐడియా లేదు. ‘దియ’ షూటింగ్‌ సమయంలో విజయ్‌కు రాఖీ కూడా కట్టింది సాయి పల్లవి’’ అని ఇద్దరి సన్నిహితులు చెప్పుకొచ్చారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top