‘మీ దగ్గరికి వచ్చే దాకా మిమ్మల్ని మిస్‌ అవుతాను’

Rishi Kapoor Daughter Riddhima Shares Emotional Note - Sakshi

‘మీ దగ్గరకు చేరే వరకు నేను మిమ్మల్ని మిస్‌ అవుతాను’ అంటూ రిషి కపూర్‌ కూమార్తె రిధిమా కపూర్‌ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఆమె సోషల్‌ మీడియా ద్వారా  తండ్రికి కన్నీటి వీడ్కోలు పలికారు. బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు రిషి కపూర్‌ గురువారం ఉదయం మృతిచెందిన విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా క్యాన్సర్‌ వ్యాధితో పోరాటం చేసిన రిషి కపూర్‌ శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ముంబైలో కన్నుమూశారు. రిషికపూర్‌ మృతిపై బాలీవుడ్‌ ఇండస్ట్రీ విచారం వ్యక్తం చేస్తోంది. సోషల్‌ మీడియా వేదికగా ప్రముఖులు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా రిషి కపూర్‌ కూతురు రిధిమా కపూర్‌ తండ్రి మరణంపై విచారం వ్యక్తం చేశారు. (నా ప్రేయసితో బ్రేకప్‌ అయినపుడు నీతూ సాయం చేసింది’)

గతంలో తండ్రితో దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ.. ‘నాన్న ఐ లవ్‌ యూ. నేను మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తునే ఉంటాను. నా జీవితంలో బలమైన వ్యక్తిని కోల్పోయాను. ప్రతి రోజు మిమ్మల్ని మిస్‌ అవుతాను. మనం మళ్లీ కలిసే వరకు నేను నిన్ను మిస్‌ అవుతాను. పప్పా ఐ లవ్‌ యూ’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కాగా రిషికపూర్‌కు భార్య నీతూ సింగ్ కుమార్తె రిధిమా కపూర్‌ సాహ్ని, కుమారుడు రణ్‌బీర్‌ కపూర్‌ ఉన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రిధిమా కపూర్‌కు తండ్రిని కడసారి చూసేందుకు అనుమతి లభించింది. రోడ్డు మార్గం ద్వారా ముంబై వెళ్లేందుకు ఆమెకు అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో 1400 కి. మీ ప్రయాణించి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.(‘మిమ్మ‍ల్ని చాలా మిస్‌ అవుతాను చింటూ సార్‌’)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top