పవన్‌ కొడుకుపై వర్మ కామెంట్‌ | Ram Gopal Varma commented on Pawan Kalyan son | Sakshi
Sakshi News home page

పవన్‌ చిన్నకొడుకుపై వర్మ కామెంట్‌

Oct 11 2017 11:51 AM | Updated on Mar 22 2019 5:33 PM

Pawan Kalyan_RGV - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆడపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల కాదేది కవితకనర్హం అంటారు శ్రీశ్రీ. సినిమాలు, రాజకీయాలు, ఫొటోలు కావేవి కామెంట్‌కు అనర్హం అంటారు దర్శకుడు రాంగోపాల్‌ వర్మ. ఎవరి మీదనైనా అలవోకగా సంచులకొద్ది పంచులు, సెటైర్లు వేస్తారు. తన భావాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తుంటారు. తాజాగా ఇదే తరహాలో పవన్ కళ్యాణ్ పై మరోసారి కామెంట్‌ చేశారు.

తాజాగా నాలుగోసారి తండ్రైన పవన్‌ కల్యాణ్‌  ఫోటో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ఇందులో పవన్‌ అప్పుడే పుట్టిన తన పసికందుని ఎత్తుకుని ఉన్నాడు. దానితో చాలామంది పవన్‌కు చిన్న కుమారుడు పుట్టాడంటూ, వైరల్ గా షేర్లు చేస్తూ అభినందనలు తెలియజేశారు. అయితే వర్మ మాత్రం తనదైన శైలిలో కామెంట్‌ చేశారు. ఫొటోలో 'పవన్ కళ్యాణ్ ఊహించలేనంత క్యూట్ గా ఉన్నాడు' అంటూ కామెంట్ చేశారు. అభిమానులు మాత్రం మరో పవర్‌స్టార్‌ అంటూ మురిసిపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement