కొంటె పనులు ఏం చేయలేదు

Rashikhanna chit chat with her fans on twitter - Sakshi

ఫ్యాన్స్‌ అంటే రాశీఖన్నాకి బోలెడంత అభిమానం. అందుకే అప్పుడప్పుడూ తన సినిమాల గురించి ట్వీటర్‌ ద్వారా అప్‌డేట్‌ ఇస్తూ ఉంటారు. ఎక్కువ టైమ్‌ దొరికితే ఫ్యాన్స్‌తో చాట్‌ చేస్తారు. శనివారం అభిమానులకు ఆ చాన్స్‌ దక్కింది. ఆ చిట్‌ చాట్‌లోని కొన్ని విశేషాలు.

► మీ బ్యూటీ సీక్రెట్‌?
టైమ్‌కు తినడం, పడుకోవటం. ఈ రెండూ పర్ఫెక్ట్‌గా లేకపోతే ఆ ఇంపాక్ట్‌ మన స్కిన్‌పై పడుతుంది. జిమ్‌లో మాత్రం బాగా కష్టపడతాను.

► ఫిట్‌నెస్‌ కోసం చాలా కష్టపడతారు. మీకు మోటివేషన్‌ ఎక్కడి నుంచి వస్తుంది?
నేను సెల్ఫ్‌ మోటివేటెడ్‌ పర్సన్‌. హెల్తీగా ఉండాలనే కోరికలో నుంచి ఈ మోటివేషన్‌ లభిస్తుంది.

► మీ ఫేవరెట్‌ ఫిల్మ్‌?
క్రిస్టొఫర్‌ నోలన్‌ తీసిన ‘ఇన్‌సెప్షన్‌’. అది మైండ్‌ బ్లోయింగ్‌ సినిమా.

► మీకు నచ్చిన కొటేషన్‌?
చేంజ్‌ ఈజ్‌ ది ఓన్లీ కాన్‌స్టన్ట్‌ (మార్పొక్కటే స్థిరమైనది)

► మీ దృష్టిలో ఫెయిల్యూర్‌కి డెఫినేషన్‌ ?
మన మీద మనకు నమ్మకం లేకపోవడం.

► మీ బ్యాడ్‌ మూడ్‌ని దూరం చేసేది?
సంగీతం.

► స్కూల్‌లో మీరు చేసిన కొంటె పని?
అలాంటి పనులు ఏం చేయలేదు.. స్కూల్‌లో నేను చాలా సైలెంట్‌ అమ్మాయిని.

► సీక్రెట్‌ ఆఫ్‌ సక్సెస్‌ ఏంటి?
హార్డ్‌ వర్క్‌.

► ప్రస్తుతం టాలీవుడ్‌లో  మీ అభిమాన హీరోయిన్‌లు?
సమంత, అనుష్క.
 

► యాక్టింగ్‌లో మీ ఇన్‌స్పిరేషన్‌?
హాలీవుడ్‌ నటి మెరిల్‌ స్ట్రీప్‌.

► ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటారు. సీక్రెట్‌ ఏంటి?
ప్రతిసారీ పాజిటివ్‌గా ఉండటం కుదరదు. నేనూ కొన్నిసార్లు డౌన్‌ అవుతాను. కానీ, మన మీద మనకు ఉన్న నమ్మకమే మనల్ని పాజిటివ్‌గా, స్ట్రాంగ్‌గా ఉంచుతుంది.

► లక్‌ని నమ్ముతారా ?
నేను కేవలం సిన్సియారిటీ, హార్డ్‌ వర్క్‌నే నమ్ముతాను.

► వరుసగా యాక్టింగ్‌కి స్కోప్‌ ఉన్న సినిమాల్లో ఎందుకు కనిపించరు?
మేం స్క్రిప్ట్స్‌ని చూజ్‌ చేసుకోలేం, స్క్రిప్ట్సే మమ్మల్ని చూజ్‌ చేసుకుంటాయి. ప్రభావతి (ఊహలు గుసగుసలాడే), వర్ష (తొలిప్రేమ) లాంటి పాత్రలు తరచూ రావు. మాకు ఆఫర్‌ చేసిన దాంట్లో బెస్ట్‌ ఎంచుకోవడానికి ట్రై చేస్తా.

► నటిగా మారినప్పటి నుంచి మీలో మీరు గమనించిన మార్పు?
మనుషుల్ని అర్థం చేసుకోవడంలో బెటర్‌ అయ్యాననుకుంటున్నాను.

► సూపర్‌ హీరో? పురాణాల్లో ఏదైనా పాత్ర? ఏది సెలెక్ట్‌ చేసుకుంటారు?  
పురాణాల్లో సూపర్‌ పవర్స్‌ ఉన్న ఏ క్యారెక్టర్‌ అయినా ఓకే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top