లేట్‌నైట్‌లో హీరోహీరోయిన్లు.. ఫోటోలు హల్‌చల్‌ | Ranbir Kapoor and Alia Bhatt Late Night Photos Viral | Sakshi
Sakshi News home page

Jul 7 2018 11:09 AM | Updated on Apr 3 2019 6:34 PM

Ranbir Kapoor and Alia Bhatt Late Night Photos Viral - Sakshi

అర్ధరాత్రి హీరోహీరోయిన్లు ముచ్చటించుకుంటున్న ఫోటోలు హాట్‌ టాపిక్‌గా మారాయి. బాలీవుడ్‌ యూత్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌, హీరోయిన్‌ అలియాభట్‌లు కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. కరణ్‌ జోహర్‌ ‘బ్రహ్మస్త్ర’ ప్రాజెక్టులో వీరిద్దరూ కలిసి నటిస్తుండగా.. గత కొంత కాలంగా డేటింగ్‌ చేస్తున్నారంటూ కథనాలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్‌ మాట్లాడుతూ.. ‘నేనెప్పుడు సింగిల్‌గా ఉండను. ఇప్పుడూ అంతే’ అంటూ అలియాతో ఉన్న రిలేషన్‌ గురించి పరోక్షంగా స్పందించాడు. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి బంధం గురించి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వీళ్లిద్దరూ ఇలా ఒకే చోట.. అది కూడా రాత్రి పూట కావటం మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

మీడియా అత్యుత్సాహం...  వీళ్లిద్దరి తాజా కలయికపై బాలీవుడ్‌ మీడియా ఛానెళ్లు విపరీతమైన అర్థాలతో కథనాలను ప్రచురించాయి. అయితే సంజు సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న రణ్‌బీర్‌.. శుక్రవారం రాత్రి అలియా ఇంట్లో పార్టీ చేసుకున్నారు. ఈ ఈవెంట్‌లో రణ్‌బీర్‌-అలియాతోపాటు దర్శకదిగ్గజం-అలియా తండ్రి మహేష్‌ భట్‌ కూడా పాల్గొన్నారు. అయినప్పటికీ బాల్కనీలో ఉన్న వీళ్లిద్దరి ఫోటోలను మాత్రమే హైలెట్‌ చేస్తూ కథనాలతో మీడియా ఛానెళ్లు అత్యుత్సాహం ప్రదర్శించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement