ప్రభాస్ టైటిల్‌తో రానా

Rana next movie title adavi ramudu - Sakshi

యంగ్ హీరో రానా సోలో హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం 1945 సినిమాలో నటిస్తున్న ఈ యంగ్ హీరో తరువాత చేయబోయే సినిమాలను కూడ లైన్ లో పెట్టాడు. బాలీవుడ్ క్లాసిక్ హాథీ మేరి సాథీ సినిమాను అదే పేరుతో రీమేక్ చేయనున్నాడు.  1971లో రాజేష్ ఖన్నా హీరోగా తెరకెక్కిన ‘హాథీ మేరే సాథీ’  సినిమా ఘనవిజయం సాధించింది.  ఇప్పుడు ఆ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందించేలా ప్లాన్ చేస్తున్నారు. రానా పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ లోగోను రివీల్ చేశారు చిత్రయూనిట్. 

ఫస్ట్ లుక్ ను న్యూ ఇయర్ కానుక 2018 జనవరి 1న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే ఈ సినిమాకు తెలుగులో అడవి రాముడు అనే టైటిల్ ను ఫైనల్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అడవి రాముడు టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. దీంతో హాథీ మేరీ సాథీ సినిమా కోసం ఈ టైటిల్ రిజిస్టర్ చేయించారని భావిస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ సూపర్‌ సినిమా టైటిల్ అయిన అడవి రాముడు పేరుతో ప్రభాస్ హీరోగా ఓ సినిమా రూపొందింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు అదే టైటిల్ తో రానా సినిమా చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top