కూత్తాన్‌ కోసం రమ్యానంబీశన్‌ పాట | Ramyanaibhasan is the song for Kootthan | Sakshi
Sakshi News home page

కూత్తాన్‌ కోసం రమ్యానంబీశన్‌ పాట

Aug 3 2017 4:11 AM | Updated on Sep 17 2017 5:05 PM

కూత్తాన్‌ కోసం రమ్యానంబీశన్‌ పాట

కూత్తాన్‌ కోసం రమ్యానంబీశన్‌ పాట

నటి రమ్యానంబీశన్‌లో మంచి గాయని ఉందన్న విషయం తెలిసిందే.

తమిళసినిమా:  నటి రమ్యానంబీశన్‌లో మంచి గాయని ఉందన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆమె పాడిన పైపైపై కలచీపై అనే పాట ఇప్పటికీ వాడ వాడలా మారుమోగుతోంది. తాజాగా కూత్తాన్‌ చిత్రం కోసం మరోసారి తన గళం విప్పింది. నీలగిరీస్‌ డ్రీమ్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఆ చిత్రానికి నవదర్శకుడు ఏఎల్‌.వెంకీ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ ఇది ఒక నృత్యదర్శకుడి ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్న విభిన్న కథా చిత్రం అని చెప్పారు. ఇందులో రాజ్‌కుమార్‌ హీరోగా నటిస్తుండగా హీరోయిన్లుగా శ్రీజిత, కీర, సన నటిస్తున్నారని తెలిపారు. విలన్‌గా ప్రభుదేవా సోదరుడు నాగేంద్రప్రసాద్‌ నటిస్తున్నారని చెప్పారు. బాలాజీ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో వివేక్‌ రాసిన ఓడు ఓడు కాదల్‌ కాడు మిరండీ అనే పాటను నటి రమ్యనంబీశన్‌తో పాడిస్తే బాగుంటుందని భావించామన్నారు. ఈమె చాలా చక్కగా పాడారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement