అసలు నిజం ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’లో చూపిస్తా : వర్మ | Ram Gopal Varma Tweet Find out the Truth in Lakshmis NTR | Sakshi
Sakshi News home page

Feb 3 2019 11:41 AM | Updated on Feb 3 2019 11:42 AM

Ram Gopal Varma Tweet Find out the Truth in Lakshmis NTR - Sakshi

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మరో సంచలన ట్వీట్ చేశాడు. ఇప్పటివరకు లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాకు సంబంధించి చంద్రబాబు ప్రస్తావన ప్రత్యక్షంగా తీసుకురాని వర్మ, తాజా ట్వీట్‌లో మాత్రం సీబీఎన్ అంటూ చంద్రబాబు పేరును కూడా తెరమీదకు తీసుకువచ్చాడు. వై కట్టప్పా కిల్డ్‌ బాహుబలి ఈజ్‌ ఫిక్షన్‌ (కట్టప్ప, బాహుబలిని ఎందుకు చంపాడు అన్నది కథ), వై సీబీఎన్‌ (చంద్రబాబు నాయుడు) బ్యాక్‌స్టాబడ్‌ ఎన్టీఆర్‌ ఈజ్‌ రియల్‌ (సీబీఎన్‌, ఎన్టీఆర్‌ను ఎందుకు వెన్నుపోటు పొడిచాడు అన్నది నిజం).ఆ నిజమేంటో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌లో తెలుసుకోండి అంటూ మరో సంచలన ట్వీట్ చేశాడు వర్మ.

ఎన్టీఆర్‌ జీవితంలోని కీలక ఘట్టాల నేపథ్యంలో రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం చిత్రకరణ జరపుకుంటోంది, యాజ్ఞ శెట్టి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రలో ఓ రంగస్థల నటుడ్ని పరిచయం చేయబోతున్నాడు వర్మ. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు వర్మ తన స్టైల్‌లో జోరుగా నిర్వహిస్తున్నాడు.


Advertisement
 
Advertisement
Advertisement