నేను కూడా ప్రేమిస్తా : వర్మ | Ram Gopal Varma Intresting Tweet | Sakshi
Sakshi News home page

May 19 2018 12:37 PM | Updated on Jul 15 2019 9:21 PM

Ram Gopal Varma Intresting Tweet - Sakshi

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మరో ఆసక్తికర ట‍్వీట్‌ చేశారు. తనకు ఎలాంటి సెంటిమెంట్లు లేవు, తనకు ఎవరి మీద ప్రేమలేదని చెప్పే రామ్‌ గోపాల్‌ వర్మ తాను కూడా ప్రేమించగలనని ట్వీట్ చేశారు. ప్రస్తుతం నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న ఆఫీసర్‌ సినిమా పనుల్లో బిజీగా ఉన్న ఓ కుక్క పిల్లతో దిగిన ఫోటోనూ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు.

ఫొటోతో పాటు తాను కూడా ప్రేమించగలనని కామెంట్‌ చేశారు. నాగార్జున హీరోగా వర్మ తెరకెక్కించిన ఆఫీసర్‌ మే 25న రిలీజ్‌ కావాల్సి ఉంది. అయితే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కాకపోవటంతో సినిమా రిలీజ్‌ను జూన్‌ 1కి వాయిదా వేశారు. ముంబై మాఫీయా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తుండగా మైరా సరీన్‌ మరో కీలక పాత్రలో కనిపించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement