గోదారి నుంచి వచ్చేసినా.. | Ram Charan wraps up shoot in Godavari abruptly | Sakshi
Sakshi News home page

గోదారి నుంచి వచ్చేసినా..

Apr 29 2017 11:24 PM | Updated on Sep 5 2017 9:59 AM

గోదారి నుంచి వచ్చేసినా..

గోదారి నుంచి వచ్చేసినా..

గోదావరి గట్టున... పాపికొండల మధ్యలో... కొల్లేటి సరస్సులో... ఆల్మోస్ట్‌ నెల రోజులు రామ్‌చరణ్‌ అండ్‌ టీమ్‌ గోదావరి పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్‌ చేశారు.

గోదావరి గట్టున... పాపికొండల మధ్యలో... కొల్లేటి సరస్సులో... ఆల్మోస్ట్‌ నెల రోజులు రామ్‌చరణ్‌ అండ్‌ టీమ్‌ గోదావరి పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్‌ చేశారు. రామ్‌చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ శుక్రవారం పూర్తయింది. విపరీతమైన వేడి, ఎండల మధ్య షూటింగ్‌ చేశారు. ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న సమంత అయితే... షెడ్యూల్‌ కంప్లీట్‌ కావడానికి ఒక్కరోజు ముందు  వేడి, ఎండ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయారు.

అంత కష్టపడుతూ షూటింగ్‌ చేశారన్న మాట. అయితే... గోదారి నుంచి వచ్చేసినా టీమంతా ఆ షెడ్యూల్‌ గురించే మాట్లాడుతున్నారు. ఎండల గురించో, తాము పడిన కష్టం గురించో కాదు. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత సుకుమార్‌ అండ్‌ కో రషెస్‌ చూశారు. అవుట్‌పుట్‌ చూసి హ్యాపీగా ఉన్నారట. ఫస్ట్‌ షెడ్యూల్‌లో హీరో హీరోయిన్లపై ఓ సాంగ్, కీలక టాకీ పార్ట్‌ షూట్‌ చేశారు. త్వరలో సెకండ్‌ షెడ్యూల్‌ మొదలు కానుంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: రత్నవేలు, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్‌ చెరుకూరి.

Advertisement
 
Advertisement
Advertisement