దీపావళికైనా వస్తుందా..?

Ram Charan Boyapati Srinu Movie First Look - Sakshi

రంగస్థలం లాంటి బిగ్‌ హిట్ తరువాత మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దసరా రోజు సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ అవుతుందని ఆశపడ్డ అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ తాజాగా దీపావళి కానుకగా ఫస్ట్ లుక్‌ రిలీజ్‌ కు ప్లాన్‌ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.  ఈ విషయంపై చిత్రయూనిట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. ఈ సినిమాకు వినయ విధేయ రామ అనే పేరును పరిశీలిస్తున్నారట. ఇప్పటికైనా చిత్రయూనిట్‌ అధికారికంగా డేట్‌ ఎనౌన్స్‌ చేస్తుందేమో చూడాలి.

రామ్‌ చరణ్‌ సరసన భరత్‌ అనే నేను ఫేం కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. జీన్స్‌ ఫేం ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేష్‌లు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top