ఛలో అజర్‌ బైజాన్‌

Ram charan and boyapati srinu movie updates - Sakshi

మరో ఇరవై రోజుల పాటు రామ్‌చరణ్‌ అండ్‌ టీమ్‌ ఇండియాలో కనిపించరట. వర్కింగ్‌ హాలీడేగా దుబాయ్‌కి పయనం కానున్నారు. రామ్‌చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ ఇందులో కథానాయిక. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రబృందం మరో నాలుగు రోజుల్లో దుబాయ్‌ ప్రయాణం అవ్వనున్నారని సమాచారం.

దుబాయ్‌ పక్కనున్న అజర్‌ బైజాన్‌లో 23రోజుల పాటు షూటింగ్‌ చేయనున్నారట. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ ఫ్యామిలీ సాంగ్‌ కూడా షూట్‌ చేయనున్నారు. సెప్టెంబర్‌ ఫస్ట్‌ వీక్‌లో దుబాయ్‌ ప్రయాణం అవుతారు చిత్రబృందం. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జనవరి 11న రిలీజ్‌ కానుంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top