విజయ్‌కి జోడీ? | Rakul Preet Singh To Act in Vijay | Sakshi
Sakshi News home page

విజయ్‌కి జోడీ?

Jun 17 2019 3:06 AM | Updated on Jul 23 2019 11:50 AM

Rakul Preet Singh To Act in Vijay - Sakshi

రకుల్‌ ప్రీత్‌సింగ్‌

రకుల్‌ ప్రీత్‌సింగ్‌ వరుస సినిమాలు అంగీకరించడం లేదు. కానీ క్రమం తప్పకుండా క్రేజీ ప్రాజెక్ట్స్‌లో భాగం అవుతున్నారు. ప్రస్తుతం తెలుగులో నాగార్జునతో ‘మన్మథుడు2’లో నటిస్తున్నారామె. తమిళంలో శివకార్తికేయన్‌తో ఓ సినిమా చేస్తున్నారు. హిందీలో ‘మర్జావా’ అనే చిత్రం చేస్తున్నారు. తాజాగా తమిళ స్టార్‌ హీరో విజయ్‌కి జోడీగా రకుల్‌ నటించనున్నారని తెలిసింది. తమిళ యంగ్‌ డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌తో విజయ్‌ ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో హీరోయిన్‌గా పలువురి పేర్లు వినిపించాయి. అయితే.. రకుల్‌ప్రీత్‌ అయితే బావుంటుందని చిత్రబృందం భావిస్తోందని కోలీవుడ్‌ సమాచారం. విజయ్‌తో నటిస్తే మాత్రం రకుల్‌ కోలీవుడ్‌లో టాప్‌ లీగ్‌లోకి ఎంటర్‌ అవడం ఖాయం అనే మాట వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement