రకుల్ ప్రీత్ ‘దాగుడుమూతలు’ | Rakul Preet to act Harish Shankars multi starrer | Sakshi
Sakshi News home page

Dec 16 2017 11:51 AM | Updated on Dec 16 2017 11:51 AM

Rakul Preet to act Harish Shankars multi starrer - Sakshi

డీజె దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించిన దర్శకుడు హరీష్ శంకర్, ఓ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. యువ కథానాయకులు నితిన్, శర్వానంద్ ల కాంబినేషన్ లో దాగుడు మూతలు సినిమాను తెరకెక్కించనున్నాడు హరీష్. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక‍్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది.

ఒక హీరోయిన్ గా సాయి పల్లవిని ఫైనల్ చేశారు. మరో హీరోయిన్ పాత్రకు రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకోనున్నారన్న టాక్ వినిపిస్తోంది. నితిన్‌కు జోడిగా సాయిపల్లవి నటిస్తుండగా శర్వానంద్ సరసన రకుల్ ను నటింప చేయాలని ప్రయత్నిస్తున్నారు. తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోల సరసన జోడి కడుతున్న రకుల్ ఈ పాత్రకు అంగీకరిస్తుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే హరీష్ శంకర్ రకుల్ కు కథ కూడా వినిపించాడట. అయితే రకుల్ మాత్రం సినిమా చేసేది లేనిది క్లారిటీ ఇవ్వకుండా దాగుడు మూతలు ఆడుతుందన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement