‘కాలా’ శునకానికి కోట్లలో బేరం | Rajinikanth Kaala Movie Dog get High Value | Sakshi
Sakshi News home page

‘కాలా’ శునకానికి కోట్లలో బేరం

Mar 10 2018 6:56 AM | Updated on Sep 29 2018 4:26 PM

Rajinikanth Kaala Movie Dog get High Value - Sakshi

సాక్షి, పెరంబూరు: సినీ నటుడు రజనీకాంత్‌ నటించిన కాలా చిత్రంలో ఉన్న ఓ శునకానికి కోట్లలో బేరాలు రావడం ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. అది ఒక సాధారణ కుక్క అట. అయితే సిమోన్‌ అనే శునకాల శిక్షకుడు ఈ కుక్కకు చక్కగా ట్రైనింగ్‌ ఇచ్చి కాలా చిత్రంలో నటింపజేశారట. 

దీనికి మణి అని నామకరణం కూడా చేశాడట. సినిమాల్లో జంతు జీవాలను ఉపయోగించుకున్న తర్వాత యజమానుల వెంట వెళ్లిపోతుంటాయి. అయితే శునకరాజు మణిపై రజనీ పడటంతో దానికి కోట్ల రూపాయల్లో బేరం పలుకుతోంది. మలేషియాకు చెందిన రజనీకాంత్‌ అభిమానులు ఇప్పటికే రూ.2 కోట్లు ఆఫర్‌ చేశారట. అయితే మణి అనే ఆ శునకాన్ని దాని శిక్షకుడు సిమోన్‌ విక్రయించడానికి నిరాకరించారని సమాచారం. 
 

Advertisement
 
Advertisement
Advertisement