breaking news
high rate
-
అధిక రేటింగ్ కంపెనీ బోర్డుల్లో మహిళలు
న్యూఢిల్లీ: అధిక రేటింగ్ కలిగిన కంపెనీలు.. బోర్డు సభ్యులుగా మహిళలను ఎంపిక చేసుకుంటున్నట్లు రేటింగ్ దిగ్గజం మూడీస్ ఇన్వెస్టర్ సరీ్వస్ తాజాగా పేర్కొంది. తక్కువస్థాయి రేటింగ్ కలిగిన కంపెనీలతో పోలిస్తే వీటిలో బోర్డు సభ్యులుగా స్త్రీలకు అధికంగా చోటు కలి్పస్తున్నట్లు తెలియజేసింది. సంస్థ రేటింగ్ ఇచి్చన 3,138 కంపెనీలను విశ్లేషించినట్లు వెల్లడించింది. విశ్లేషణ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్(బీఏఏ, అంతకంటే అధిక రేటింగ్) కలిగిన కంపెనీల బోర్డు సీట్లలో సగటున 29 శాతం మంది మహిళలకు చోటు లభించింది. 2023తో పోలిస్తే 1 శాతం పెరిగినట్లు వెల్లడించింది. ఇక స్పెక్యులేటివ్ గ్రేడ్(బీఏ, అంతకంటే తక్కువ రేటింగ్) కంపెనీలలో సగటున 24 % బోర్డు సీట్లను మహిళలు పొందారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య యథాతథమే. అభివృద్ధిచెందిన ఆర్థిక వ్యవస్థల్లో బోర్డు సభ్యుల లింగభేదం, క్రెడిట్ రేటింగ్స్ మధ్య పరస్పర సంబంధమున్నప్పటికీ వర్ధమాన మార్కెట్లలో ఇది లేనట్లు మూడీస్ పేర్కొంది. విశ్లేషణకు పరిగణనలోకి తీసుకున్న కంపెనీలలో 24 ఏఏఏ, 146 ఏఏ, 728 ఏ, 1165 బీఏఏ, 582 బీఏ, 394 బీ, 90 సీఏఏ, 9 సీఏ రేటింగ్ కలిగినవి ఉన్నట్లు వెల్లడించింది. -
రూ.100 కోట్ల అపార్ట్మెంట్ డీల్: షాక్ అవుతున్న మార్కెట్ నిపుణులు
ఆర్థిక పరిస్థితులు ఎలా న్నప్పటికీ రానున్న పదేళ్లలో రియల్ ఎస్టేట్ రంగానికి ఢోకా లేదన్న నిపుణుల అంచనాల మధ్య ఢిల్లీలో 100కోట్ల రూపాయల తాజా అపార్ట్మెంట్ డీల్ మార్కెట్ వర్గాలను విస్మయ పరుస్తోంది. గుర్గావ్ , ఢిల్లీలోని సంపన్న ప్రాంతాలలో లగ్జరీ రియల్ ఎస్టేట్ ఖర్చులు గణనీయంగా పెరగడంతో అత్యాధునిక అపార్ట్మెంట్ల ధరలు ఒక రేంజ్లో పెరిగినట్టు తెలుస్తోంది. ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, రియల్ ఎస్టేట్ కమ్యూనిటీ గోల్ఫ్ కోర్స్ రోడ్‌లోని DLF ద్వారా ది కామెలియాస్ వద్ద 10వేలచదరపు అడుగుల అపార్ట్మెంట్ ఏకంగా రూ.100 కోట్లకు అమ్ముడు బోయింది. దీనికి సంబంధించిన వార్తల ఇపుడు బిజినెస్ వర్గాల్లో సందడి చేస్తోంది. కొన్ని నెలల క్రితం, అదే స్థలంలో అదే పరిమాణంలో ఉన్న అపార్ట్మెంట్ రూ.60 కోట్లకు విక్రయించారు. గత నాలుగు నెలల్లో ఈ అడ్రస్‌కి చదరపు అడుగుకి ధరలు గణనీయంగా పెరగడమే ప్రాపర్టీ ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. (కష్టాల్లో ఐటీ రంగం: టెకీ ఉద్యోగాలపై సంచలన నివేదిక) "చాలా స్టార్టప్ వ్యవస్థాపకులు, ఎంఎన్సీల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, వ్యాపారవేత్తలు ఇక్కడ నివాసముండటమే కారణమని ఇండియా సోథెబీస్ ఇంటర్నేషనల్ రియాల్టీ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ గోయల్ అభిప్రాయం. ముఖ్యంగా స్టార్ క్లాస్ ఎమినిటీస్, పర్యావరణ వ్యవస్థ కారణంగా ఇక్కడ నివసించడానికి ఇష్టపడతారు అందుకే DLF గోల్ఫ్ లింక్స్‌లో అపార్ట్మెంట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇంకా పూర్తికాని 10వేల చదరపు అడుగుల యూనిట్ ధర రూ.85 కోట్లకు విక్రయిస్తుంది డీఎల్ఎఫ్. అయితే దీనికితోడు అత్యాధునిక డిజైన్లు, ఇంటీరియర్స్ కోసం తహ తహలాడుతున్న కొనుగోలుదారులు వీటిన్నంటికి కలిపి రూ.100 కోట్లకు పైగా వెచ్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలోని అత్యంత ఖరీదైన కండోమినియంలలో ఒకటి ఈ ప్రాంతాన్ని పేర్కొంటున్నారు. గుర్గావ్, ఢిల్లీలోని సంపన్న ప్రాంతాలలో లగ్జరీ రియల్ ఎస్టేట్ ఖర్చులు గణనీయంగా పెరిగాయి. దీంతో నైరుతి సబర్బ్‌లోని అత్యాధునిక అపార్ట్మెంట్లు , లుటియన్స్ జోన్‌లోని మాన్షన్ల ధరలు పెరిగాయి. ఫలితంగా ముంబైలోని పాపులర్ ఏరియాల్లో ధరలకు పోటీగా ఇక్కడ చదరపు అడుగు ధర రూ.1 లక్ష దాటిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. (Amazon Layoffs: అమెజాన్ మళ్లీ షాక్ ఇచ్చింది: ఈసారి ఎవరంటే..!) ఆగస్ట్ నాటి నైట్ ఫ్రాంక్, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరేడెకో) సంయుక్త నివేదిక ప్రకారం, భారతదేశ రియల్ ఎస్టేట్ రంగం 2047 నాటికి 5.8 ట్రిలియన్ డాలర్లకు విస్తరిస్తుందని అంచనా. ది ఇప్పటికే ఉన్న 7.3శాతం వాటా నుండి GDPకి 15.5శాతం దోహదం చేస్తుంది.‘ఇండియా రియల్ ఎస్టేట్: విజన్ 2047’ నివేదిక ప్రకారం రియల్ ఎస్టేట్ రంగంలో రెసిడెన్షియల్ సెగ్మెంట్‌కు అధిక వాటా ఉంటుంది. "2047 నాటికి,వందేళ్ల స్వతంత్ర్య భారతావని ఆర్థిక వ్యవస్థ పరిమాణం 33-40 ట్రిలియన్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసినట్టు వెల్లడించింది.. -
తెలంగాణలో ఉల్లి @170
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ‘ఉల్లి బాంబ్’ పేలింది! గత కొంతకాలంగా సామాన్యులను బెంబేలెత్తిస్తూ ఎగబాకుతున్న ధర తాజాగా ‘ఆల్‌టైం హై’ను తాకింది. ఇప్పటివరకు సెంచరీ మార్కుకు అటు ఇటుగా పలికిన ధర గురువారం ఒక్కసారిగా ఆకాశాన్నం టింది. హైదరాబాద్‌లోని మలక్‌పేట మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనం తగా మొదటి రకం ఉల్లి హోల్‌సేల్‌లో క్వింటాలుకు ఏకంగా రూ.14,500 పలికింది. అంటే హోల్‌సేల్‌లోనే కిలో రూ. 145కు చేరింది. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకునేందుకు వ్యాపారులు మరింతగా రేట్లను పెంచడంతో రిటైల్ మార్కెట్లో ధర రూ. 160 నుంచి రూ.170 మధ్య పలుకుతూ మధ్యతరగతి ప్రజలు ఉల్లి పేరెత్తాలంటేనే జంకేలా చేస్తోంది. రెండో రకం ఉల్లి కిలో రూ. 120, మూడో రకం ఉల్లి రూ. 80 పలుకుతుండగా నాసిరకం ఉల్లి సైతం రూ.70 పలుకుతోంది. దీంతో కిలో నుంచి 2కిలోల వరకు ఉల్లి కొందామని మార్కె ట్‌కు వెళ్తున్న వారు అరకిలోతో సరిపెట్టుకుంటున్నారు. గతేడాది ఇదే సీజన్లో ఉల్లి ధరలు రూ.30 దాటలేదని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతుండటం గమనార్హం. ఈసారి దేశవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతినడం, పొరుగు రాష్ట్రాల నుంచి డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా లేకపోవడం, విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉల్లి రాకకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో ధర ఇప్పట్లో దిగొచ్చే పరిస్థితి కనిపించట్లేదు. దీనికితోడు మహారాష్ట్ర వ్యాపారులతో స్థానిక వ్యాపారులు కుమ్మక్కు కావడం, నిల్వలపై నిఘా కొరవడడం మార్కెట్లో మరింతగా రేట్ల అగ్గిని రాజేస్తోంది. పొరుగున తగ్గిన సాగు వల్లే ఉల్లి ఘాటు... తెలంగాణలో ఉల్లిసాగు ఎక్కువగా లేకపోవడంతో పొరుగు రాష్ట్రాలపైనే రాష్ట్రం ఆధార పడుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్,కర్ణాటక రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రత్యేకించి మహారాష్ట్ర నుంచి వచ్చే దిగుమతులే రాష్ట్ర ప్రజల అవసరాలను తీరుస్తున్నాయి. దేశంలో 60–70 శాతం ఉల్లి దిగుబడికి మహారాష్ట్రే కేంద్రంకాగా అక్కడ ఈసారి సాగు గణనీయంగా తగ్గిపోయింది. గతేడాది 4 లక్షల హెక్టార్లలో సాగు జరగ్గా ఈ ఏడాది కేవలం రెండున్నర లక్షల హెక్టార్లకు సాగు పడిపోయింది. దీనికితోడు ఆగస్టు నుంచి మూడు నెలలపాటు కురిసిన భారీ వర్షాలతో వేసిన పంటంతా దెబ్బతిన్నది. దీంతో ప్రస్తుత ముంబై, పుణేలోనే ఉల్లి కిలో గత 2–3 నెలలుగా రూ. 90 నుంచి రూ. 100 మధ్య పలుకుతోంది. సాధారణంగా మహారాష్ట్రలో ఉల్లి కొరత ఉంటే అక్కడి వ్యాపారులు పాకిస్తాన్, ఈజిప్ట్, చైనా, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి దిగుమతి చేసుకుంటారు. అయితే ప్రస్తుతం పాక్ నుంచి ఉల్లి దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించడంతో అక్కడి నుంచి సరఫరా ఆగిపోయింది. బంగ్లాదేశ్‌ను ముంచెత్తిన వరదల కారణంగా అక్కడి నుంచి సరఫరా లేదు. దీంతో ఈజిప్ట్, టర్కీ నుంచి ఉల్లి దిగుమతి చేసుకుంటున్నారు. ఉల్లి దిగుమతి కోసం కిలోకు రూ. 6–8 ఖర్చు వస్తుండటంతో మహారాష్ట్రలోనే కిలో రూ. 110 వరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. మరోవైపు కర్ణాటక నుంచి సైతం ఉల్లి రాకపోవడంతో ధరలు ఏమాత్రం దిగిరావడం లేదు. ఈ నెల 2న 6,471 క్వింటాళ్ల మేర ఉల్లి రాష్ట్రానికి రాగా గురువారానికి అది 3 వేల క్వింటాళ్లకు తగ్గింది. దీంతో మూడు నాలుగు రోజుల కిందటి వరకు కిలో ఉల్లి రూ. 90–100 మధ్య ఉండగా గురువారం మలక్‌పేట మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఉల్లి క్వింటాల్ ధర రూ.14,500 పలికింది. ఇది బహిరంగ మార్కెట్‌కు వచ్చేసరికి రూ.160 నుంచి రూ.170కి విక్రయిస్తున్నారు. కర్నూలు ఉల్లికి పెరిగిన డిమాండ్... రాష్ట్రానికి కర్నూలు జిల్లా నుంచి కూడా ఉల్లి దిగుమతి జరుగుతోంది. కర్నూలులో ఏటా 87,500 ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తుండగా ఈ ఏడాది అది 50 వేల ఎకరాలకు పడిపోయింది. దీనికితోడు ఈ ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలతో జిల్లాలో పంట పూర్తిగా దెబ్బతిన్నది. మరోవైపు సాగు చేసిన పంటలోనూ ఎకరానికి 60 క్వింటాళ్ల మేర రావాల్సిన దిగుబడి 35–40 క్వింటాళ్లకు పడిపోయింది. దీంతో అక్కడే ధరలు అమాంతం పెరిగాయి. సెప్టెంబర్‌లో క్వింటాల్ ధర గరిష్టంగా రూ. 4,500కు, అక్టోబర్‌లో రూ. 4,600కు నవంబర్‌లో రూ. 5,250 పలికింది. సాగు, దిగుబడులు తగ్గడం, స్థానిక డిమాండ్ అధికంగా ఉండటంతో కర్నూలు మార్కెట్‌కు గతంలో రోజూ 5–6 వేల క్వింటాళ్ల ఉల్లి పంట వచ్చేది. కానీ ప్రస్తుతం అది రోజుకు వెయ్యి క్వింటాళ్లకు తగ్గింది. దీంతో అక్కడి నుంచి రాష్ట్ర అవసరాల మేరకు ఉల్లి రావట్లేదు. మరోవైపు ప్రజలకు రాయితీపై కిలో ఉల్లి రూ. 25కే సరఫరా చేసేందుకు ఎంత ధరకైనా కొనుగోళ్లు జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులకు సూచించడంతో మార్కెట్ యార్డు అధికారులు, వ్యాపారులు పోటీ పడి కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో ఉల్లి ధరలకు అమాంతం డిమాండ్ పెరిగి ధరలు నింగినంటుతున్నాయి. కర్నూలు మార్కెట్లో గత బుధవారం మధ్యాహ్నానికి క్వింటాలు ఉల్లి ధర గరిష్టంగా రూ. 12,510 పలికింది. ఈ ప్రభావం తెలంగాణపై పడి ఇక్కడి ధరల పెరుగుదలకు కారణమైంది. ‘మహా’ సిండికేట్... రాష్ట్రంలో డిమాండ్ తగ్గట్టుగా లేని ఉల్లి సరఫరాను వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. తెలంగాణలో ఉల్లి నిల్వలకు కోల్డ్ స్టోరేజీలు లేకపోవడంతో పూర్తిగా మహారాష్ట్రపై ఆధారపడుతున్న రాష్ట్ర వ్యాపారులు అక్కడి వ్యాపారులతో సిండికేట్ అయ్యారు. కొనుగోలు చేసిన ఉల్లిని రాష్ట్రానికి తీసుకురాకుండా అక్కడే నిల్వ చేసి కృతిమ కొరత సృష్టిస్తున్నారు. అదీగాక తక్కువ బరువు తూగే పాత స్టాక్‌కు ధర ఉండదన్న ఉద్దేశంతో దాన్ని తీసుకురాకుండా ఎక్కువ బరువుండే తాజా స్టాక్‌నే తీసుకొస్తున్నారు. మహారాష్ట్ర నుంచి 10 లారీలు వస్తుంటే అందులో 3 పాత స్టాక్ లారీలయితే 7 కొత్త స్టాక్వి ఉంటున్నాయి. కొత్త స్టాక్‌కు ధర పెంచేసి విక్రయాలు చేస్తున్నారు. ఉల్లి అక్రమ నిల్వలను అరికట్టేందుకు రిటైలర్లు 100 క్వింటాళ్లు, హోల్‌సేల్ వ్యాపారులు 500 క్వింటాళ్లకు మించి నిల్వ చేసుకోరాదని కేంద్రం స్పష్టం చేసినా ఎక్కడా దీనిపై నిఘా ఉన్నట్లు కనిపించట్లేదు. ఈజిప్టు ఉల్లే దిక్కు.. దేశంలో ఆకాశాన్నంటిన ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం గత నెల చివరి వారంలో టర్కీ నుంచి 11 వేల మెట్రిక్ టన్నులు, ఈజిప్ట్ నుంచి 6,090 మెట్రిక్ టన్నుల ఉల్లిగడ్డలను దిగుమతి చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈజిప్ట్ ఉల్లి ఈ నెల రెండో వారానికల్లా ముంబై చేరుతుందని కేంద్రం ప్రకటించింది. ఈజిప్ట్ ఉల్లిలోంచి తమకు వారానికి 100 టన్నులకు తగ్గకుండా సరఫరా చేయాలని ఇప్పటికే రాష్ట్రం కేంద్రానికి లేఖ రాసింది. ఈజిప్ట్ నుంచి వచ్చే స్టాక్ ఈ నెల 10కల్లా ముంబై పోర్టుకు చేరే అవకాశం ఉందని, ఆ తర్వాత మూడు రోజుల్లో రాష్ట్రానికి ఉల్లి చేరొచ్చని మార్కెటింగ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కనీసం 500 టన్నుల ఈజిప్టు ఉల్లి తెలంగాణకు దిగుమతి అవుతుందని, అప్పడే ధరలు తగ్గుతాయని చెబుతున్నారు. రాష్ట్రంలో నారాయణఖేడ్ సహా ఇతర ప్రాంతాల్లో సాగు చేసిన ఉల్లి పంట ఫిబ్రవరి ఆఖరు లేదా మార్చిలో మార్కెట్లోకి వస్తుందని, అప్పటివరకు ధరాఘాతం తప్పదని చెబుతున్నారు. ఆనియన్ దోశ.. పకోడిలు బంద్! ఉల్లి ధరల దెబ్బకు హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో ఉల్లి సంబంధిత వంటకాలను హోటళ్లు, తోపుడు బండ్లపై వ్యాపారులు చాలా వరకు తగ్గించేశారు. ముఖ్యంగా ఉల్లి దోశ, పకోడి, మిర్చి, పానీపూరీల్లో ఉల్లి వాడకంపై స్వీయ ఆంక్షలు పెట్టుకున్నారు. తోపుడు బండ్ల వద్ద ‘ఉల్లి మళ్లీ అడగరాదు’ అని బోర్డులు పెడుతున్నారు. ఇక బిర్యానీల్లో ఉల్లి వాడకం జరుగుతున్నా వాటితోపాటు ఇచ్చే సలాడ్‌లో ఉల్లి స్థానంలో కీరా, క్యారెట్లను ఇస్తున్నారు. వినియోగదారులు ఉల్లి అడిగితే సలాడ్‌కు రూ. 20–30 వసూలు చేస్తున్నారు. ఈ ప్రభావం పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలపైనా పడుతోంది. హైదరాబాద్‌లోని 10 రైతు బజార్లకు మలక్‌పేట మార్కెట్ నుంచి 30 క్వింటాళ్లను కొనుగోలు చేసి సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు. ఉల్లి ధర తగ్గే వరకు రైతు బజార్లకు ఉల్లి సరఫరా చేస్తామని చెప్పారు. -
మిర్చి అ‘ధర’హో!
ఖమ్మం వ్యవసాయం : మిర్చి రైతులకు శుభవార్త. శుక్రవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి క్వింటా ధర రూ. 9,950 పలకగా, సోమవారానికి ఏకంగా రూ. 450లు పెరిగి రూ. 10,400కు చేరింది. పంట సాగు తగ్గడం, ఆశించిన స్థాయిలో ఉత్పత్తి లేకపోవడంతో ధర పెరుగుతోంది. మార్చి నెల ఆరంభంలో రూ. 9,200లు పలికిన ధర క్రమంగా పెరుగుతూ 19 రోజుల వ్యవధిలో దాదాపు రూ.1,200పైకి వెళ్లడం విశేషం. ప్రతి ఏటా మార్చిలో మార్కెట్‌కు నిత్యం 70 వేల నుంచి లక్ష బస్తాల వరకు విక్రయానికి వస్తుంది. ఈ ఏడాది ప్రస్తుతం 20 వేల నుంచి 30 వేలకు మించి రావట్లేదు. అంతర్జాతీయంగా తేజా రకం మిర్చికి డిమాండ్ ఉండటంతో ఆ రకం ధర పెరుగుతోందని అంచనా వేస్తున్నారు. -
‘కాలా’ శునకానికి కోట్లలో బేరం
సాక్షి, పెరంబూరు: సినీ నటుడు రజనీకాంత్ నటించిన కాలా చిత్రంలో ఉన్న ఓ శునకానికి కోట్లలో బేరాలు రావడం ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. అది ఒక సాధారణ కుక్క అట. అయితే సిమోన్ అనే శునకాల శిక్షకుడు ఈ కుక్కకు చక్కగా ట్రైనింగ్ ఇచ్చి కాలా చిత్రంలో నటింపజేశారట. దీనికి మణి అని నామకరణం కూడా చేశాడట. సినిమాల్లో జంతు జీవాలను ఉపయోగించుకున్న తర్వాత యజమానుల వెంట వెళ్లిపోతుంటాయి. అయితే శునకరాజు మణిపై రజనీ పడటంతో దానికి కోట్ల రూపాయల్లో బేరం పలుకుతోంది. మలేషియాకు చెందిన రజనీకాంత్ అభిమానులు ఇప్పటికే రూ.2 కోట్లు ఆఫర్ చేశారట. అయితే మణి అనే ఆ శునకాన్ని దాని శిక్షకుడు సిమోన్ విక్రయించడానికి నిరాకరించారని సమాచారం. -
రెండోస్సారి...
సూరత్: ప్రధాని మోదీ బంద్గలా సూటు ధర పైపైకి ఎగబాకుతోంది! బుధవారం నాటి వేలంలో రూ.1.21 కోట్లు పలికిన బిడ్డింగ్.. గురువారం ఏకంగా రూ.1.48 కోట్లకు పెరిగింది. సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి ముకేశ్ పటేల్ ఈ భారీ మొత్తాన్ని కోట్ చేశారు. గురువారం రూ.1.25 కోట్లతో వేలం ప్రారంభమైంది. ఆ వెంటనే ముకేశ్ పటేల్ రూ.1.39 కోట్లు పలికారు. లీలా గ్రూప్ సీఎండీ కోమల్కాంత్ రూ.1.41 కోట్లు కోట్ చేశారు. అనంతరం ముకేశ్ మరో రూ.7 లక్షలు పెంచారు. శుక్రవారం కూడా ఈ వేలం కొనసాగనుంది. ‘‘మోదీ చేపట్టిన గంగా ప్రక్షాళన కార్యక్రమం ఎంతో నచ్చింది. ఆయన సీఎంగా ఉన్నప్పుడూ బహుమతులను వేలంలో అమ్మి బాలికల విద్య కోసం ఇచ్చారు. ఇప్పుడూ ఓ మంచి కార్యక్రమం కోసం వేలం పెట్టినందున ఆ కోటును కొనాలనుకుంటున్నా’’అని ముకేశ్ చెప్పారు. ఇక గురువారమే కోటుకు రూ.1.25 కోట్లు కోట్ చేసిన రాజేశ్ మహేశ్వరి అంతకన్నా ముందుకు వెళ్లలేకపోయారు.