మామా అల్లుళ్ల అరుదైన ఫొటో | Rajinikanth bonds with his 'Mapillai' Dhanush | Sakshi
Sakshi News home page

మామా అల్లుళ్ల అరుదైన ఫొటో

Dec 12 2015 5:24 PM | Updated on Sep 3 2017 1:53 PM

మామా అల్లుళ్ల  అరుదైన ఫొటో

మామా అల్లుళ్ల అరుదైన ఫొటో

ఆ ఇద్దరూ సూపర్ స్టార్లే.. పైగా ఇద్దరూ మామ అల్లుళ్లు. వీరిద్దరికి సంబంధించిన ఓ అరుదైన ఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

చెన్నై: ఆ ఇద్దరూ సూపర్ స్టార్లే..  పైగా ఇద్దరూ మామ అల్లుళ్లు. వీరిద్దరికి సంబంధించిన ఓ అరుదైన ఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ వాళిద్దరూ ఎవరంటే.... ఒకరు తమిళ సూపర్ స్టార్  రజనీకాంత్ అయితే   మరొకరు మరో సూపర్ స్టార్, ఆయన అల్లుడు ధనుష్. రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా మామగారికి  శుభాకాంక్షలు తెలుపుతూ అల్లుడు ధనుష్ అభిమానుల కోసం ఒక అపురూపమైన ఫోటోను  ట్విట్టర్ లో షేర్ చేశారు.

రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యని 2004లో  ధనుష్ పెళ్లి చేసుకున్నాడు. విలక్షణ సినిమాలతో, విభిన్నమైన పాత్రలతో తమిళ సినీ ప్రపంచంలో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు ధనుష్.  వరుస భారీ విజయాలతో తనదైన స్టయిల్లో దూసుకు పోతున్నాడు. అటు వరదల్లో అతలాకుతలమైన చెన్నైవాసులుకు  సంఘీభావంగా రజనీకాంత్  తన పుట్టినరోజు వేడుకలను రద్దు చే సుకున్న సంగతి తెలిసిందే.

 

Advertisement
 
Advertisement
Advertisement