రజనీ ‘2.O’కు మరో షాక్‌

Rajinikanth And Shankar 2-0 Making Video - Sakshi

సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 2.ఓకు మరో షాక్‌ తగిలింది. ఈ సినిమాకు సంబంధించిన బీబీసీ సంస్థ చేస్తున్న డాక్యుమెంటరీలోని 2 నిమిషాల మేకింగ్‌ వీడియో లీకైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. రజనీ, అమీ జాక్సన్‌లపై ఓ పాట చిత్రీకరణకు సంబంధించిన వీడియో క్లిప్‌ నెట్‌లో వైరల్‌ అయ్యింది.

లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది నవంబర్‌లో రిలీజ్‌ కానుంది. చాలా రోజుల క్రితమే రిలీజ్‌ కావాల్సి ఉన్నా విజువల్‌ ఎఫెక్ట్స్ ఆలస్యం కావటంతో సినిమా వాయిదా పడుతూ వస్తోంది. దీనికి తోడు లీకులు కూడా సినిమాకు ఇబ్బంది కరంగా మారాయి. గతంలో టీజర్‌ రిలీజ్ చేయాలని భావించినా అది కూడా ముందే లీకైపోవటంతో చిత్రయూనిట్ టీజర్ లాంచ్‌ ఆలోచనను వాయిదా వేశారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top