రణ్‌వీర్‌ ట్వీట్‌కు.. పోలీసుల సినిమాటిక్‌ రిప్లై

Rajasthan Police Cinematic Replay On Ranveer Singh Tweet - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ చేసిన ఓ ట్వీట్‌కు రాజస్తాన్‌ పోలీసుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ ట్వీట్‌కు రాజస్తాన్‌ పోలీసులు ఇచ్చిన రిప్లై సరదాగా ఉండటమే కాకుండా, మనసుకు హత్తుకునేలా ఉంది. తొలుత ఓ ట్వీట్‌లో రణ్‌వీర్‌, రాజస్తాన్‌ పోలీసులతో కలిసి దిగిన ఓ ఫొటోను షేర్‌ చేసి వారికి ధన్యవాదములు తెలిపారు.

అయితే దీనిపై సినిమాటిక్‌గా స్పందించిన రాజస్తాన్‌ పోలీసులు.. రణ్‌వీర్‌ సినిమాలలో కొన్ని పేర్లను ఉదహరిస్తు ఓ సందేశాన్ని ఉంచారు. ‘మీరు గల్లీ బాయ్‌గా వచ్చారు. కానీ బాజీరావు మస్తానీ, సూపర్‌ పోలీసు సింబా లాగా గొప్ప స్థాయికి ఎదిగారు. మీతో ఉంటే ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. నెక్స్ట్‌ టైమ్‌ నువ్వు రాజస్తాన్‌కు.. నీ భార్య దీపికా పదుకోన్‌తో కలిసి రావాలి.. అప్పుడు ప్రజలు బ్యాండ్‌ బాజా భారత్‌తో వస్తార’ని సరదాగా వ్యాఖ్యానించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top