‘కల్కి’ టీజర్‌ : అదరగొడుతున్న రాజశేఖర్!

Rajasekhar Kalki Teaser Released - Sakshi

‘గరుడవేగ’ ఇచ్చిన సక్సెస్‌తో హీరో రాజశేఖర్‌లో మంచి జోష్‌ కనబడుతోంది. చాలాకాలంగా సరైన హిట్‌ కోసం ఎదరుచూసిన ఈ హీరోకు సరైన టైమ్‌లో సరైన సినిమా పడింది. ఈ సినిమా అంచనాలకు మించి ఆడటంతో రాజశేఖర్‌ తదుపరి ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి నెలకొంది. 

నేడు (ఫిబ్రవరి 4) రాజశేఖర్‌ పుట్టినరోజు సందర్భంగా ‘కల్కి’ టీజర్‌ను రిలీజ్‌ చేశారు. బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌తో ఎంట్రీ ఇచ్చిన యాంగ్రీ స్టార్‌ రాజశేఖర్‌ టీజర్‌తో అదరగొట్టేస్తున్నాడు. 1980 నేపథ్యంలోని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ క్రైమ్‌ బ్యాగ్రౌండ్‌లో ఉండబోతోందని తెలుస్తోంది. మొత్తానికి కల్కితో మరో విజయాన్ని సొంతం చేసుకునేలా ఉన్నారు రాజశేఖర్‌. సి కల్యాణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అ!’ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీకి శ్రావణ్‌ భరద్వాజ్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top