మరోసారి చిన్నారి ప్రేమను చాటుకున్న లారెన్స్‌

Raghava Lawrence's endearing gesture for a differently abled fan - Sakshi - Sakshi

తమిళసినిమా: చిన్నారులకు సహాయం చేయడంలో సినీ నటులు, దర్శకుడు రాఘవ లారెన్స్‌ ముందుంటాడు. ముఖ్యంగా దివ్యాంగ చిన్నారులకు ఆయన అనేక సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నాడు. ఇదిలా ఉండగా అజిత్‌ అనే దివ్యాంగ చిన్నారి లారెన్స్‌ వీరాభిమాని అని, అతడు ఒక్కసారైనా లారెన్స్‌ను చూడాలని ఇష్టపడుతున్నట్టు తన అభిమాన సంఘం నిర్వాహకుల ద్వారా తెలిసింది. అంతే వెంటనే లారెన్స్‌ ఆ చిన్నారిని కలుసుకోవడానికి ఏర్పాట్లు చేశాడు.

తన చిన్నారి అభిమానితో మన హీరో కొన్ని నిమిషాల పాటు చర్చించి, తర్వాత ఫొటోలు, వీడియోలు తీసుకుని ఆ దివ్యాంగ చిన్నారి ఆశ నెరవేర్చాడు. ఇలా తనకు చిన్నారులపై ఉన్న ప్రేమను మరోసారి లారెన్స్‌ చాటుకున్నాడు.ఈ ఫొటోలు, వీడియో దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఏదేమైనా రాఘవలారెన్స్‌ మంచి మనస్సుకు హ్యాట్సాప్‌ అని అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top