
రాఘవ లారెన్స్ తన సినీ జీవితం కంటే ఎక్కువగా సేవా కార్యక్రమాలకు సమయం కేటాయించడం ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఆయన ట్రస్ట్ ద్వారా వేలాది మంది జీవితాల్లో వెలుగు నింపారు. ఈ ట్రస్ట్ ప్రధానంగా సామాజిక సేవా కార్యక్రమాలు, ఆరోగ్య సహాయం, విద్యా సహాయం వంటి రంగాల్లో సేవలు అందిస్తోంది. అనాథ పిల్లలకు ఆశ్రయ, ఆహారం, విద్య, సంరక్షణ వంటి విషయంలో ఆయన అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే తన సొంత ఇంటిని కూడా సేవా కార్యక్రమం కోసం ఉపయోగిస్తున్నట్లు ప్రకటించారు.
తాజాగా రాఘవ లారెన్స్ సోషల్‌మీడియాలో ఒక వీడియో షేర్ చేశారు. 'మీ అందరితో కొన్ని సంతోషకరమైన విషయాలను పంచుకోవాలనుకుంటున్నాను. నా సినిమా కాంచన- 4 అధికారికంగా ప్రారంభమైంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమా పనులు వేగంగా జరుగుతున్నాయి. మీలో చాలా మందికి తెలిసినట్లుగా.., నా సినిమాలకు అడ్వాన్స్ తీసుకున్న ప్రతిసారీ నేను ఒక కొత్త సామాజిక కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని తెలిసిందే. ఈ క్రమంలోనే నా మొదటి ఇంటిని పిల్లల కోసం ఉచిత విద్య పాఠశాలగా మారుస్తున్నాను. ఈ విషయం ప్రకటించడానికి నేను నిజంగా సంతోషస్తున్నాను.
ఈ ఇల్లు నాకు చాలా ప్రత్యేకమైనది. నేను డ్యాన్స్ మాస్టర్‌గా సంపాదించిన డబ్బుతో కొన్న మొదటి ఇల్లు ఇది. తరువాత, నేను దానిని అనాథాశ్రమ పిల్లల కోసం గృహంగా మార్చాను. ఆ సమయంలో కుటుంబంతో నేను అద్దె ఇంటిలోకి మారాను. ప్రస్తుతం నా పిల్లలు పెద్దవారై ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ ఇంటిని మరోసారి ఒక లక్ష్యానికి అంకితం చేయడం నాకు గర్వంగా ఉంది. నేను ప్రారంభిస్తున్న ఉచిత పాఠశాలలో మొదటి ఉపాధ్యాయులు కూడా నా ఇంట్లో పెరిగిన బిడ్డే కావడం విశేషం. నేను చేరదీసిన బిడ్డ ఇప్పుడు చదువుకుని తిరిగి ఇవ్వడానికి వచ్చింది. ఈ విషయం నాకు మరింత సంతోషంగా, గర్వంగా ఉంది. మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ నా మీద ఉంటాయని ఆశిస్తున్నాను.' అని ఆయన అన్నారు.
Kanchana 4 is rolling and halfway through — I’m Happy to Announce That I’m Transforming My First Home into a Free School for Children with my Kanchana 4 Advance - with the First Teacher Being a Child Who Grew Up in my home 🙏
I’m so delighted to share some exciting news with… pic.twitter.com/qvcCYQruGE— Raghava Lawrence (@offl_Lawrence) September 11, 2025