కేరళ బాధితులకు లారెన్స్‌ సాయం ‘కోటి’ | raghava lawrence donate 1 cr for kerala floods | Sakshi
Sakshi News home page

కేరళ బాధితులకు లారెన్స్‌ సాయం ‘కోటి’

Aug 24 2018 12:27 AM | Updated on Aug 24 2018 12:27 AM

raghava lawrence donate 1 cr for kerala floods - Sakshi

రాఘవ లారెన్స్‌

కేరళ వరద బాధితుల సహాయార్థం ప్రముఖ నటుడు రాఘవ లారెన్స్‌ కోటి రూపాయల సాయం ప్రకటించారు. కోలీవుడ్‌లో ఇంత పెద్ద మొత్తాన్ని ప్రకటించిన నటుడు లారెన్సే. వరదల్లో కేరళ ప్రజల కష్టాలు తనను కలచివేశాయని ఈ సందర్భంగా లారెన్స్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ సీఎం విజయన్‌ను శనివారం కలిసి చెక్‌ను అందజేస్తానని తెలిపారు. బాధితులు ఎవరైనా తనను వ్యక్తిగతంగా కలిస్తే, వారికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. సేవా కార్యక్రమాల్లో లారెన్స్‌ ఎప్పుడూ ముందుంటారనే విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement