షాక్‌లో ఉన్నా

Radhika Sarathkumar escapes from blasts in Sri Lanka Bomb Blasts - Sakshi

బాంబ్‌ బ్లాస్టులతో శ్రీలంక వణికిపోయింది. చర్చిలు, హోటల్స్‌లో ఆదివారం బాంబ్‌ బ్లాస్టులు జరగడంతో సుమారు 185 మందికిపైగా చనిపోయారు. ఈ భారీ పేలుళ్ల ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు నటి రాధికా శరత్‌కుమార్‌. బాంబు పేలుళ్లకు  కొద్ది గంటల ముందు వరకూ  ఆ హోటల్‌లోనే బస చేశారట రాధిక.

ఈ విషయాన్ని ట్వీటర్‌లో ఆమె తెలుపుతూ – ‘‘ఓ మై గాడ్‌..  శ్రీలంకలో వరుస బాంబ్‌ బ్లాస్ట్‌లు జరిగాయి. నేను హోటల్‌ నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటికే అక్కడ పేలుడు సంభవించింది. ఇంకా నమ్మలేకపోతున్నాను. షాక్‌లో ఉన్నాను’’ అని పేర్కొన్నారు. శ్రీలంకలో జరిగిన ఈ విషాదానికి అన్ని సినీ ఇండస్ట్రీల ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top