కరీంనగర్‌లో.. పూరి విగ్రహం | Puri Jagannath's Statue in Karimnagar | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో.. పూరి విగ్రహం

Apr 30 2017 11:45 PM | Updated on Sep 27 2018 8:55 PM

కరీంనగర్‌లో.. పూరి విగ్రహం - Sakshi

కరీంనగర్‌లో.. పూరి విగ్రహం

సినిమా స్టార్స్‌కి ఉండే క్రేజే వేరు. కొందరు వీరాభిమానులు తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ల విగ్రహాలు ఏర్పాటు చేసి, తమ ప్రేమను

సినిమా స్టార్స్‌కి ఉండే క్రేజే వేరు. కొందరు వీరాభిమానులు తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ల విగ్రహాలు ఏర్పాటు చేసి, తమ ప్రేమను చాటుకుంటారు. మరికొందరు ఏకంగా ఆలయాలు కట్టించి తమ అభిమానం చాటుకుంటుంటారు. తాజాగా దర్శకుడు పూరి జగన్నాథ్‌ విగ్రహాన్ని ఆయన అభిమానులు ఏర్పాటు చేశారు. కరీంనగర్‌ జిల్లా కొండాపూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన పూరి జగన్నాథ్‌ విగ్రహాన్ని ఆయన తనయుడు ఆకాశ్‌ పూరి ఆవిష్కరించడం విశేషం.

ఆ ఆనందాన్ని ఆకాశ్‌ అభిమానులతో పంచుకున్నారు. ‘‘నా జీవితంలో మరచిపోలేని రోజు ఇది. నేను గర్వించదగ్గ రోజు’’ అని ఆకాష్‌ అన్నాడు. తండ్రిని ఉద్దేశించి ‘‘మీ విగ్రహం ఏర్పాటు చేయడం, దాన్ని నేను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలు మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నారో తెలుస్తోంది. లవ్‌ యూ నాన్న. ఇంత ప్రేమ చూపించిన అభిమాని ప్రభాకర్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు ఆకాశ్‌.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement