భార్యకు ఖరీదైన బహుమతి ఇచ్చిన టాప్‌ హీరో | Puneeth Rajkumar Gifts Costly Car To Wife | Sakshi
Sakshi News home page

భార్యకు ఖరీదైన బహుమతి ఇచ్చిన టాప్‌ హీరో

Mar 9 2019 9:19 AM | Updated on Mar 9 2019 9:25 AM

Puneeth Rajkumar Gifts Costly Car To Wife - Sakshi

బెంగళూరు : మహిళా దినోత్సవం సందర్భంగా కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ తన భార్యకు ఖరీదైన బహుమతి ఇచ్చారు. ఇప్పటికే పలు ఖరీదైన కార్లు కొనుగోలు చేసిన పునీత్‌ రాజ్‌కుమార్‌ శుక్రవారం మరో ఖరీదైన కారు కొనుగోలు చేశారు. భార్య అశ్విని కోరిక మేరకు రూ.5 కోట్ల విలువ చేసే ల్యాంబోర్గిని కారును పునీత్‌ కొనుగోలు చేసి భార్యకు కానుకగా ఇచ్చారు. ఇంతకు ముందు కూడా భార్యకు ఖరీదైన జాగ్వార్‌ కారును బహుకరించారు పునీత్‌. ఇప్పుడు అత్యంత ఖరీదైన ల్యాంగోర్గిని కారు కలిగిన దర్శన్, నిఖిల్‌ కుమారస్వామి నటుల సరసన పునీత్‌ రాజ్‌కుమార్‌ కూడా చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement