అందుకే ‘దోస్తానా-2’కు నో చెప్పాను! | Priyanka Chopra Rajkummar Rao Preparing For The White Tiger | Sakshi
Sakshi News home page

ప్రియాంక కోసమే ‘దోస్తానా’  వదులుకున్నాడు!

Oct 17 2019 2:46 PM | Updated on Oct 17 2019 4:50 PM

Priyanka Chopra Rajkummar Rao Preparing For The White Tiger - Sakshi

ముంబై : నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు హీరో రాజ్‌కుమార్‌ రావు. కంగనా రనౌత్‌ వంటి టాప్‌ హీరోయిన్లతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న అతడు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాజ్‌కుమార్‌ నటించిన మేడ్‌ ఇన్‌ చైనా షూటింగ్‌ పూర్తి చేసుకోగా... జాన్వీ కపూర్‌తో కలిసి నటిస్తున్న రూహీ అఫ్జా సహా మరో రెండు సినిమాలు సెట్స్‌పైకి వెళ్లనున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్టులో నటించే అవకాశం రాజ్‌కుమార్‌ దక్కినట్లు సమాచారం. 2008లో విడుదలైన కరణ్‌ జోహార్ ప్రొడక్షన్‌ హిట్‌ మూవీ దోస్తానా సీక్వెల్‌ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కోలిన్ డి కున్హా దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్‌, కార్తిక్‌ ఆర్యన్‌లతో పాటు రాజ్‌కుమార్‌ను తీసుకోవాలని భావించారు.

అయితే రాజ్‌కుమార్‌ మాత్రం దోస్తానా-2కు నో చెప్పి మరో సినిమాకు కమిట్‌ అయ్యాడు. ఈ విషయం గురించి ముంబై మిర్రర్‌తో మాట్లాడుతూ... ‘ నా తదుపరి సినిమాలో ప్రియాంక చోప్రాకు జోడీగా కనిపిస్తాను. ఆ సినిమా షూటింగ్‌ కూడా దోస్తానా-2తో పాటు ప్రారంభం కానుంది. అందుకే దోస్తానా టీంకు నో చెప్పాను. కోలిన్‌ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో నా క్లాస్‌మేట్‌. దోస్తానా-2 కోసం అద్భుతమైన స్క్రిప్టు రాశాడు. కానీ నేను ఛాన్స్‌ మిస్సయ్యాను’ అని పేర్కొన్నాడు. కాగా అవార్డు విన్నింగ్‌ నవల ఆధారంగా తెరకెక్కనున్న ‘ది వైట్‌ టైగర్‌’ సినిమాలో ప్రియాంకతో కలిసి రాజ్‌కుమార్‌ కనిపించనున్నాడు. ఈ సినిమాకు ప్రియాంక చోప్రా నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇక అరవింద్‌ అడిగా రచించిన ఈ నవల ప్రతిష్టాత్మక బుకర్‌ ప్రైజ్‌ గెలుచుకున్న విషయం తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్న ఈ మూవీ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.


 

Advertisement
 
Advertisement
Advertisement