సిక్కులను చంపించింది.. ఫోటో దిగుతారా? | Priyanka Chopra Family with Indira Gandhi Viral | Sakshi
Sakshi News home page

ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో ఇందిర ఫోటో.. తీవ్ర విమర్శలు

Nov 2 2017 1:40 PM | Updated on Nov 2 2017 2:19 PM

Priyanka Chopra Family with Indira Gandhi Viral - Sakshi

సాక్షి, సినిమా : ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా నటి ప్రియాంక చోప్రా పోస్ట్ చేసిన ఓ ఫోటో వివాదాస్పదంగా మారింది. తన కటుంబ సభ్యులు ఇందిరతో దిగిన ఓ ఫోటోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. అంతే కొందరు అసభ్యపదజాలంతో ప్రియాంకను తిడుతూ కామెంట్లు పెట్టారు. 

అక్టోబ‌ర్ 31న మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ వ‌ర్థంతి సందర్భంగా మూడు దశాబ్దాల క్రితం ఫోటో అంటూ షేర్‌ చేయగా.. ఫోటోలో ప్రియాంక త‌ల్లి, పిన్ని, తాత  ఇత‌ర కుటుంబ స‌భ్యులు ఉన్నారు. షేర్ చేసిన కొన్ని గంట‌ల్లోనే చాలా లైకులు, కామెంట్లు చాలా వ‌చ్చాయి. అయితే ఆ కామెంట్లలో చాలా మట్టుకు బండ బూతులు ఉండటం విశేషం. ఇందిరా గాంధీ సిక్కులను ఊచకోత కోయించిందని.. అలాంటి వ్యక్తితో ఫోటో దిగటానికి మీ కుటుంబానికి సిగ్గు లేదా? అని కొందరు.. యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్‌ గా ఉన్న మీరూ ఇలా నేతల ఫోటోలు షేర్‌ చెయ్యకండని కొందరు కామెంట్లు చేశారు.

అయితే ఆ కామెంట్లను ప్రియాంక పట్టించుకోలేదు. ఇక వివాదాలు ప్రియాంకకు కొత్తేం కాదు. గతంలో మోదీ ముందు కాలు మీద కాలేసుకుని కూర్చోవటం, జాతీయ జెండాను చున్నీలా చుట్టుకోవటం, అస్సాంపై అనుచిత వ్యాఖ్యలు... తదితర వివాదాల్లో ఆమె చిక్కుకున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement