ముచ్చటగా మూడోది! | Priyanka Chopra and Nick Jonas' Mumbai wedding reception | Sakshi
Sakshi News home page

ముచ్చటగా మూడోది!

Dec 21 2018 12:33 AM | Updated on Dec 21 2018 6:49 AM

Priyanka Chopra and Nick Jonas' Mumbai wedding reception - Sakshi

ప్రియాంకా చోప్రా, నిక్‌ జోనస్‌

బాలీవుడ్‌లో మ్యారేజ్‌ సీజన్‌ ఇంకా పూర్తయినట్టుగా లేదు. పెళ్లి తర్వాత ఫ్యామిలీ కోసం, ఇండస్ట్రీ స్నేహితుల కోసం రిసెప్షన్‌లు ఏర్పాటు చేయడంతో కొన్ని రోజులుగా పెళ్లి హడావిడే కనిస్తోంది. ప్రస్తుతం ప్రియానిక్‌ (ప్రియాంకా చోప్రా, నిక్‌ జోనస్‌) ఆల్రెడీ ఢిల్లీ, ముంబైలలో  ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు క్లోజ్‌ ఫ్రెండ్స్‌కు రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. గురువారం సినిమా ఇండస్ట్రీ వాళ్లకోసం ఓ రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు.

ముంబై తాజ్‌ హోటల్‌లో జరిగిన ఈ వేడుకకు ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు హాజరయ్యారు.  ఈ వేడుకకు ట్రెడిషనల్‌ డ్రెస్‌తో పాటు, ఇండో– వెస్ట్రన్‌ దుస్తులను డ్రెస్‌ కోడ్‌గా ఫిక్స్‌ చేశారని బాలీవుడ్‌ సమాచారం. ఈ వేడుకకు సంబంధించిన మొదటి ఆహ్వానం దీపికా పదుకోన్‌కి వెళ్లిందట. ఇటీవలే పెళ్లి చేసుకున్న రెండు కొత్త జంటలను(దీపిక–రణ్‌వీర్, ప్రియాంక–నిక్‌ జోనస్‌) ఒకే వేదికపై చూసే అవకాశం కలిగిందంటూ సంబరపడుతున్నార దీప్‌వీర్, ప్రియానిక్‌ ఫ్యాన్స్‌.

Advertisement
 
Advertisement
Advertisement