మోదీకి శుభాకాంక్షలు తెలపలేదు..!

Priya Bhavani Shankar Over Tweet About Modi - Sakshi

నటి ప్రియాభవాని శంకర్‌

పెరంబూరు : నరేంద్రమోదీకి తాను శుభాకాంక్షలు చెప్పలేదని వర్ధమాన నటి ప్రియాభవాని శంకర్‌ వివరణ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలు పొందిన రాజకీయ నాయకులకు ప్ర జలకు సినీ కళాకారులకు శుభాకాంక్షలు వివిధ రకాలుగా తెలియజేస్తున్నారు. అదే విధంగా నరేంద్రమోదీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో చాలామంది సినీ కళాకారుల మాదిరిగానే నటి ప్రియాభవాని శంకర్‌ ట్విట్టర్‌లో మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. అందులో శుభాకాంక్షలు మన నిరంతర ప్రధాని నరేంద్రమోదీ సార్‌. మోదీ రిటర్న్‌ అని పేర్కొంది. దీంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి శుభాకాంక్షలు చెప్పిన నటి ప్రియాభవాని శంకర్‌ అంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దీంతో షాక్‌కు గురైన ఆమె తాను మోదీకి శుభాకాంక్షలు తెలపలేదన్నారు.

నకిలీ ట్విట్టర్‌తో ఇదంతా చేశారు..
తన పేరుతో ఎవరో నకిలీ ట్విట్టర్‌ రూపొందించి ఆ ట్వీట్‌ను పొందుపరిచారని వివరణ ఇచ్చారు. అంతే కాదు ప్రధాని మోదీ పేరుతోనే ట్విట్టర్‌ ప్రారంభించి ఆయనకే శుభాకాంక్షలు చెప్పొచ్చు కదా! నకిలీ ట్విట్టర్‌తో ఎందుకు ఇంత ఎమోషనల్‌. మీ అభిప్రాయాలతో ఇతరులను ఇబ్బంది పెట్టకండి అంటూ నటి ప్రియ భవాని శంకర్‌ తన ట్విట్టర్‌లో పేర్కొంది. విశేషం ఏమిటంటే ప్రియా భవానిశంకర్‌ అసలైన ట్విట్టర్‌ అకౌంట్‌ కంటే నకిలీ ట్విట్టర్‌కే అధికంగా ఫాలోవర్స్‌ ఉన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top