క్షణ క్షణం ఉత్కంఠగా..! | Prathi Kshanam movie audio release | Sakshi
Sakshi News home page

క్షణ క్షణం ఉత్కంఠగా..!

Sep 28 2016 12:31 AM | Updated on Sep 4 2017 3:14 PM

క్షణ క్షణం ఉత్కంఠగా..!

క్షణ క్షణం ఉత్కంఠగా..!

మనీశ్, తేజస్విని జంటగా నాగేంద్రప్రసాద్ దర్శకత్వంలో మల్లికార్జున్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ప్రతిక్షణం’. రఘురామ్ స్వర కర్త.

మనీశ్, తేజస్విని జంటగా నాగేంద్రప్రసాద్ దర్శకత్వంలో మల్లికార్జున్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ప్రతిక్షణం’. రఘురామ్ స్వర కర్త. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పాటల సీడీలను విడుదల చేసి, తొలి సీడీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు అందించారు. ఆర్పీ మాట్లాడుతూ - ‘‘పాటలు, ట్రైలర్ బాగున్నాయి. రఘురామ్ గాయకుడిగా తెలుసు. వృత్తిపట్ల అంకితభావం ఉన్న వ్యక్తి. సంగీత దర్శకుడిగా మంచి పేరు సంపాదిస్తాడు’’ అన్నారు. ‘‘కమర్షియల్ హంగులతో కూడిన రొమాంటిక్ థ్రిల్లర్ అండ్ హారర్ చిత్రమిది. 
 
 ప్రతి సన్నివేశం ఉత్కంఠగా సాగు తుంది’’ అన్నారు దర్శకుడు. నిర్మాత మల్లికార్జున్‌రెడ్డి మాట్లాడుతూ - ‘‘హారర్ చిత్రమే కానీ దెయ్యం ఉండదు. ట్విస్టులతో ప్రతి క్షణం ఆసక్తిగా సాగుతుంది. రఘు రామ్ పాటలు, నేపథ్య సంగీతం చిత్రానికి ప్లస్ పాయింట్స్. అక్టోబర్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. నిర్మాతలు కేఎల్ దామోదర్ ప్రసాద్, సాయి వెంకట్, హీరో హీరోయిన్లు మనీశ్, తేజస్విని, స్వరకర్త రఘురామ్ పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement