ఏనుగు పోయె

Poye Enugu Po First Look Launch By Producer Raj Kandukuri - Sakshi

ఒక ఏనుగు, చిన్న పిల్లల మధ్య జరిగే సన్నివేశాలతో కేవీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పోయే ఏనుగు పో’. పీకేఎ¯Œ  క్రియేషన్స్‌ పతాకంపై ఎం. రాజేంద్ర¯Œ  తెలుగు, తమిళంలో నిర్మిస్తున్నారు. తమిళంలో ‘పో యానైకుట్టియే పో’ పేరుతో రూపొందుతోంది. ఈ చిత్రం తెలుగు టైటిల్‌ లోగో, బేనర్‌ లోగోను నిర్మాత రాజ్‌ కందుకూరి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘పోయే ఏనుగు పో’ టైటిల్‌ చాలా కొత్తగా ఉంది. మంచి కథ, మాటలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ఎం.రాజేంద్ర¯Œ  మాట్లాడుతూ– ‘‘మంచి కుటుంబ కథా చిత్రమిది. ఏనుగు, చిన్న పిల్లల మధ్య జరిగే మంచి సన్నివేశాలతో మా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. త్వరలోనే తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అమర్‌. జి, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top