విడుదలకు సిద్ధమైన ‘సువ‌ర్ణ సుంద‌రి’ | Poorna And Jayaprada Starer Suvarna Sundari Theatrical Trailer Launch | Sakshi
Sakshi News home page

విడుదలకు సిద్ధమైన ‘సువ‌ర్ణ సుంద‌రి’

Feb 6 2019 2:28 PM | Updated on Feb 6 2019 2:28 PM

Poorna And Jayaprada Starer Suvarna Sundari Theatrical Trailer Launch - Sakshi

జయప్రద,  పూర్ణ,  సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సువర్ణసుందరి’. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి సూర్య ఎమ్.ఎస్.ఎన్  దర్శకుడు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోందన్న ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో  భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా అతి  త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను ప్రముఖ ద‌ర్శకులు బి.గోపాల్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సాగ‌ర్ మాట్లాడుతూ... ‘ఇది చాలా ఎక్స్‌ట్రాడిన‌రీ చిత్రం. హీరోయిన్స్ చాలా చ‌క్కగా చేశారు. మ‌న తెలుగు సినీ ప‌రిశ్రమ‌కు అంద‌గ‌త్తే జ‌య‌ప్రద. ఆవిడ కూడా ఈ చిత్రంలో న‌టించారు. ఎంటైర్ టీమ్ కి ఆల్ ద బెస్ట్. సాయికార్తిక్ మ్యూజిక్ బావుంది. ఫైట్స్ చాలా బాగా వ‌చ్చాయి.’ అన్నారు.

హీరోయిన్‌ పూర్ణ మాట్లాడుతూ... ‘స‌హ‌నం అంటే అది సూర్య గారి నుంచే నేర్చుకోవాలి. ప్రతీ ఒక్కరికీ చాలా ఓర్పుగా త‌మ త‌మ పాత్రల గురించి చాలా చ‌క్కగా వివ‌రించి ఆయ‌న‌కు ఏమి కావాలో ఆ అవుట్ పుట్ తెప్పించుకున్నారు. ఫైట్ మాస్టర్‌కి కూడా నా కృత‌జ్ఞత‌లు. హీరో రామ్ కూడా మొద‌ట్లో కొంచం భ‌య‌ప‌డేవారు కాని బాగా న‌టించారు. సాక్షి మ‌నిద్దరి మ‌ధ్య జ‌రిగే చాలా స‌న్నివేశాలు అన్నీ ఫ‌న్నీగా జ‌రిగిపోయాయి. మా టీమ్ అంద‌రికీ ఆల్ ద బెస్ట్’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement