‘పీఓకే.. పాకిస్తాన్‌దే’’ | POK part of Pakistan : Rishi Kapoor | Sakshi
Sakshi News home page

‘‘పీఓకే.. పాకిస్తాన్‌దే’’

Nov 12 2017 1:53 PM | Updated on Nov 12 2017 3:10 PM

POK part of Pakistan : Rishi Kapoor - Sakshi

పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు కొనసాగుతున్నాయి. పీఓకే పాకిస్తాన్‌లో అంతర్భాగమని జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్లు సినీ నటుడు రిషి కపూర్‌ సంచలన ప్రకటన చేశారు. ఆక్రమిత కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు దఖలు పరిస్తేనే.. కశ్మీర్‌ సమస్యకు శాంతియుత, శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన చెప్పారు. ఫరూక్‌ అబ్దుల్లా వ్యాఖ్యలను సమర్థిస్తూ రిషి కపూర్‌ ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు.  ఆ ట్వీట్‌లో నేను చనిపోయేముందు ఒక్కసారి అయినా పాకిస్తాన్‌ను చూడాలి.. మా పూర్వీకులు మూలాలను స్పృశించాలని ఉందంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌పై రిషి కపూర్‌ ట్విటర్‌ వ్యాఖ్యలపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు, కొందరైతే తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తే.. మరికొందరు మాత్రం ఇటువంటి ట్వీట్లు చేయడం మానుకోవాలని సూచిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement