మునికోటి కుటుంబానికి పవన్ ఆర్థిక సాయం | Pawan Kalyan shows his human side yet again | Sakshi
Sakshi News home page

మునికోటి కుటుంబానికి పవన్ ఆర్థిక సాయం

Aug 9 2016 7:42 PM | Updated on Mar 22 2019 5:33 PM

మునికోటి కుటుంబానికి పవన్ ఆర్థిక సాయం - Sakshi

మునికోటి కుటుంబానికి పవన్ ఆర్థిక సాయం

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ ఏడాది కిందట ఆత్మాహుతికి పాల్పడిన మునికోటి కుటుంబానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం చేశారు.

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ ఏడాది కిందట ఆత్మాహుతికి పాల్పడిన మునికోటిని గుర్తుచేస్తూ 'సీఎంగారూ.. ఇతనెవరో తెలుసా?'.. అనే శీర్షికన 'సాక్షి'  ప్రచురించిన కథనానికి పవర్  స్టార్ పవన్ కల్యాణ్ స్పందించారు.

మునికోటి కుటుంబానికి పవన్ ఆర్థిక సాయం చేశారు. పవన్ కల్యాణ్ అనుచరులు తిరుపతిలో ఉన్న ముని కోటి కుటుంబానికి రూ.2 లక్షల చెక్ను అందజేసినట్లు సమాచారం. కష్టాల్లో ఉండి తన దృష్టికి వచ్చిన పలువురిని ఆదుకున్నారు పవన్. తాజాగా మునికోటి కుటుంబానికి అండగా నిలవడం మరోసారి ఆయన వితరణ గుణాన్ని చాటింది.

సరిగ్గా ఏడాది కిందట ప్రత్యేక హోదా నినాదంతో తిరుపతిలో ఆత్మబలిదానానికి పాల్పడ్డాడు మునికోటి. అప్పట్లో ప్రభుత్వం ఆయన కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించినప్పటకీ.. ఏడాది గడచినా మునికోటి కుటుంబం వైపు కన్నెత్తి చూసిన దాఖలాలే లేవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement