ఇండిపెండెన్స్ డేకి పవన్ గిఫ్ట్ | Pawan Kalyan new film Title and First look on aug 15th | Sakshi
Sakshi News home page

ఇండిపెండెన్స్ డేకి పవన్ గిఫ్ట్

Aug 5 2017 10:38 AM | Updated on Mar 22 2019 5:33 PM

ఇండిపెండెన్స్ డేకి పవన్ గిఫ్ట్ - Sakshi

ఇండిపెండెన్స్ డేకి పవన్ గిఫ్ట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జల్సా, అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా పవన్ ఇమేజ్ కు తగ్గ కథను సిద్ధం చేశాడట త్రివిక్రమ్. షూటింగ్ మొదలై చాలా రోజులు గడుస్తున్నా.. ఇంత వరకు ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ లను రిలీజ్ చేయలేదు.

ఇంజనీర్ అల్లుడు, ఇంజనీర్ బాబు, గోపాల కృష్ణుడు లాంటి టైటిల్స్ ఫిక్స్ చేస్తారన్న టాక్ వినిపించినా.. చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. దీంతో పవర్ స్టార్ అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. చిత్రయూనిట్ త్వరలోనే అభిమానుల కోరిక తీర్చేందుకు రెడీ అవుతోంది. ఇండిపెండెన్స్ డే కానుకగా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను కూడా ప్రకటించనున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ తో పాటు పొలిటికల్ కార్యక్రమాలతోనూ పవన్ బిజీగా ఉండటంతో ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement