ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ మానియా | Pawan Kalyan mania in twitter | Sakshi
Sakshi News home page

ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ మానియా

Jan 2 2015 11:34 AM | Updated on Mar 22 2019 5:33 PM

ట్విట్టర్లో  పవన్ కళ్యాణ్ మానియా - Sakshi

ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ మానియా

ఎప్పుడొచ్చాం అన్నది కాదన్నయ్యా... ఎంత స్పీడ్గా జనాలకు కనెక్ట్ అయ్యామన్నదే ముఖ్యం ...అన్నట్లు ట్విట్టర్లో సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మానియా కొనసాగుతోంది.

ఎప్పుడొచ్చాం అన్నది కాదన్నయ్యా... ఎంత స్పీడ్గా జనాలకు కనెక్ట్ అయ్యామన్నదే ముఖ్యం ...అన్నట్లు ట్విట్టర్లో  సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మానియా కొనసాగుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా పవన్ ట్విట్టర్ అకౌంట్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. దాంతో  పవన్ ట్విట్టర్ ఖాతాను అభిమానులు విపరీతంగా షేర్ చేసుకుంటున్నారు.

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన  తొలి ట్వీట్‌ చేశారు. అలా అకౌంట్‌ ప్రారంభించారో , లేదో వెంటనే పవన్ కళ్యాణ్  అభిమానులు ఆ విషయాన్ని ఫేస్బుక్లో షేర్ చేశారు. పవన్కు ఫాలోవర్లు నిమిష నిమిషానికీ పెరగడం మొదలుపెట్టారు. కేవలం 40 నిమిషాల్లోనే పవన్ ట్విట్టర్ ఖాతాను 5వేల మందికి పైగా ఫాలోకాగా, తాజాగా ఆ సంఖ్య 62వేలకు చేరటం విశేషం. ఇక బాలీవుడ్లో అమితాబ్, కోలీవుడ్లో రజనీకాంత్లకు ట్విట్టర్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అమితాబ్ ...ఎప్పటికప్పుడు ట్విట్టర్లో అప్డేట్గా ఉంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ను పెంచుకుంచున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement