రాక్షసి పిలుస్తోంది! | oorna's rakshasi first look released | Sakshi
Sakshi News home page

రాక్షసి పిలుస్తోంది!

Jan 9 2017 12:03 AM | Updated on Mar 19 2019 7:00 PM

రాక్షసి పిలుస్తోంది! - Sakshi

రాక్షసి పిలుస్తోంది!

హారర్‌ నేపథ్యంలో ‘కాలింగ్‌ బెల్‌’ చిత్రం తెరకెక్కించిన దర్శకుడు పన్నా రాయల్, ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘రాక్షసి’

హారర్‌ నేపథ్యంలో ‘కాలింగ్‌ బెల్‌’ చిత్రం తెరకెక్కించిన దర్శకుడు పన్నా రాయల్, ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘రాక్షసి’ పేరుతో మరో చిత్రానికి దర్శకత్వం వహించారు. పూర్ణ, అభినవ్‌ సర్దార్, అభిమన్యు సింగ్, గీతాంజలి ముఖ్యపాత్రల్లో అశోక్‌ మందా, రాజ్‌ దళవాయ్, టోనీ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. నిర్మాత లగడపాటి శ్రీధర్‌ పోస్టర్, మరో నిర్మాత రాజ్‌ కందుకూరి లోగో రిలీజ్‌ చేయగా, మరో నిర్మాత కె.సురేష్‌బాబు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

‘‘ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచే సినిమా ఇది’’ అని పన్నా రాయల్‌ అన్నారు. ‘‘ఈ సినిమాలో నాది ఇద్దరు పిల్లల తల్లి పాత్ర అనగానే ఆలోచించా. కథ విని, ఓకే చెప్పాను’’ అని హీరోయిన్  పూర్ణ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement