కరిష్మా నుంచి పిల్లల్ని నాకు అప్పగించండి! | Once Again, Karisma's Estranged Husband Files Application For Kids' Custody | Sakshi
Sakshi News home page

కరిష్మా నుంచి పిల్లల్ని నాకు అప్పగించండి!

Dec 30 2015 7:22 PM | Updated on Apr 3 2019 6:23 PM

కరిష్మా నుంచి పిల్లల్ని నాకు అప్పగించండి! - Sakshi

కరిష్మా నుంచి పిల్లల్ని నాకు అప్పగించండి!

వేరువేరుగా ఉంటున్న బాలీవుడ్ నటి కరిష్మా కపూర్, ఆమె భర్త సంజయ్‌కపూర్ మధ్య విడాకుల గొడవ సద్దుమణుగకముందే.. మరో అంశం తెరపైకి వచ్చింది.

వేరువేరుగా ఉంటున్న బాలీవుడ్ నటి కరిష్మా కపూర్, ఆమె భర్త సంజయ్‌కపూర్ మధ్య విడాకుల గొడవ సద్దుమణుగకముందే.. మరో అంశం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం కరిష్మా వద్ద ఉన్న పిల్లల్ని తన కస్టడీకి అప్పగించాలని కోరుతూ భర్త సంజయ్ కపూర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. దూరంగా ఉంటున్న ఈ దంపతుల విడాకుల పిటిషన్‌ను గత నెలలో కోర్టు పరిష్కరించింది. విడాకుల కోసం గతంలో వీరు దాఖలు చేసిన ఉమ్మడి సమ్మతిని ఉపసంహరించుకోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో తమకు పుట్టిన సమీర, కియాన్‌రాజ్‌లను కరిష్మా నుంచి తన కస్టడీకి అప్పగించాలని కోరుతూ 15 రోజుల కిందట సంజయ్‌కపూర్ ఫామిలీ కోర్టులో దరఖాస్తు చేశారని ఆయన తరఫు లాయర్ తెలిపారు. గతంలోనూ సంజయ్‌కపూర్ ఇదే తరహా అప్లికేషన్‌ను కోర్టులో వేశారని, అయితే, అప్పట్లో విడాకుల కోసం ఇద్దరు ఉమ్మడి సమ్మతితో కోర్టును ఆశ్రయించడం, విడాకుల చట్టంలో పిల్లల సంరక్షణకు సంబంధించిన నిబంధనలు ఉండటంతో ఆయన తన దరఖాస్తును ఉపసంహరించుకున్నారని ఆయన వివరించారు. ఈ విషయమై స్పందించడానికి కరిష్మా తరఫు లాయర్‌ ముందుకురాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement