హిందీలో... ఓ.కే. బంగారం | o k bangaram movie remake in hindhi | Sakshi
Sakshi News home page

హిందీలో... ఓ.కే. బంగారం

Mar 22 2016 12:34 AM | Updated on Sep 3 2017 8:16 PM

హిందీలో... ఓ.కే. బంగారం

హిందీలో... ఓ.కే. బంగారం

గతంలో ‘ఆషికీ-2’ చిత్రం ద్వారా అందరినీ ఆకట్టుకున్న జంట - శ్రద్ధా కపూర్, ఆదిత్యారాయ్ కపూర్.

గతంలో ‘ఆషికీ-2’ చిత్రం ద్వారా అందరినీ ఆకట్టుకున్న జంట - శ్రద్ధా కపూర్, ఆదిత్యారాయ్ కపూర్. దీర్ఘకాలంగా ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులను ఓ శుభవార్త. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలసి మళ్ళీ తెర మీదకొస్తున్నారు. వారి లేటెస్ట్ సినిమా ‘ఓకే... జానూ’ షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. మణిరత్నం దర్శకత్వంలో హిట్టయిన తమిళ చిత్రం ‘ఓ.కె. కన్మణి’ (తెలుగులో ‘ఓ.కె. బంగారం’)కి ఇది హిందీ రీమేక్. ఇక్కడ దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ ధరించిన పాత్రల్ని ఈ హిందీ రీమేక్ ‘ఓ.కె. జానూ’లో ఆదిత్యారాయ్ కపూర్, శ్రద్ధాకపూర్‌లు పోషిస్తున్నారు. ముంబయ్‌లోని మెరైన్‌డ్రైవ్ ప్రాంతంలో హీరో హీరోయిన్లిద్దరూ ద్విచక్ర వాహనం మీద వెళుతున్న దృశ్యాలను ముందుగా చిత్రీకరించారు. కథ రీత్యానే కాక, గత చిత్రాల రీత్యా కూడా వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండుతుందని అందరూ ఎదురుచూస్తున్నారు. షాద్ అలీ దర్శకత్వంలో ప్రసిద్ధ ధర్మా ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్‌జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఉత్తరాదిన కూడా హిట్టవుతుందేమో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement