రాంగోపాల్‌ వర్మకు నోటీసులు | notices to ramgopal varma | Sakshi
Sakshi News home page

రాంగోపాల్‌ వర్మకు నోటీసులు

Feb 8 2018 3:55 PM | Updated on Feb 9 2018 2:58 PM

notices to ramgopal varma - Sakshi

దర్శకుడు రాంగోపాల్‌ వర్మ

సాక్షి, హైదరాబాద్‌ : వివాదాలకు కేంద్ర బిందువు, సంచలనాలకు మారుపేరైన దర్శకుడు రాంగోపాల్ వర్మకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు షాక్‌ ఇచ్చారు. గాడ్‌ సెక్స్‌ ట్రూత్‌(జీఎస్టీ)పై నమోదైన కేసులో తమ ముందు విచారణకు రావాలని వర్మకి సీసీఎస్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు.  పోలీసుల ఎదుట గురువారం వర్మ హాజరు కావాల్సివుంది. నోటీసు అందుకున్నా తాను విచారణకు హాజరు కాలేనని లాయర్ ద్వారా పోలీసులకు ఆయన సమాచారం ఇచ్చారు.

ముంబైలో నాగార్జున సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నానని, వచ్చే వారంలో మళ్లీ నోటీసు ఇస్తే వస్తానని వర్మ తెలిపినట్లు సమాచారం. రాంగోపాల్‌ వర్మకి  పోలీసులు మళ్లీ నోటీసు ఇవ్వనున్నారు. మహిళలఫై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, మహిళలను పెట్టి న్యూడ్(అశ్లీల) సినిమాలు తీస్తానని అన్నందుకే నోటీసు ఇచ్చామని, దానిఫై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు పోలీసులు తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement