సీక్వెల్‌ చాన్స్‌ | Nivetha Pethuraj joins Prabhu Solomon's next | Sakshi
Sakshi News home page

సీక్వెల్‌ చాన్స్‌

Aug 3 2018 2:39 AM | Updated on Aug 3 2018 2:39 AM

Nivetha Pethuraj joins Prabhu Solomon's next - Sakshi

నివేథా పేతురాజ్‌

‘మెంటల్‌ మదిలో, టిక్‌ టిక్‌ టిక్‌’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తమిళ కథానాయిక నివేథా పేతురాజ్‌. చక్కటి హావభావాలతో పాటు గ్లామర్‌పరంగా మార్కులు కొట్టేశారు. దాంతో వరుసగా అవకాశాలు క్యూ కట్టేశాయి. ఆల్రెడీ తమిళంలో మూడు సినిమాలు, తెలుగులో ఒక సినిమాతో బిజీగా ఉన్నారీ భామ. దానికి తోడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్‌ కొట్టేశారట. 2012లో తమిళ నటుడు శివాజీ గణేశన్‌ మనవడు, నటుడు ప్రభు కుమారుడు విక్రమ్‌ ప్రభుని పరిచయం చేస్తూ  దర్శకుడు ప్రభు సాల్మన్‌ తెరకెక్కించిన చిత్రం ‘కుమ్‌కి’. తెలుగులో ‘గజరాజు’ పేరుతో రిలీజైంది. ఇప్పుడు ‘కుమ్‌కి’ సీక్వెల్‌ రూపొందించే పనిలో పడ్డారట దర్శకుడు. ఈ సీక్వెల్‌లో హీరోయిన్‌గా నివేథా పేరును పరిశీలిస్తున్నారట. ఫస్ట్‌ పార్ట్‌లో యాక్ట్‌ చేసిన విక్రమ్‌ ప్రభునే ఈ సీక్వెల్‌లోనూ కనిపిస్తారు. ఈ ఏడాదే సెట్స్‌పైకి వెళ్లనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement