పవన్, నితిన్ల సినిమా మొదలైంది..! | Nithin, Pawan Kalyan film shooting Updates | Sakshi
Sakshi News home page

పవన్, నితిన్ల సినిమా మొదలైంది..!

Jul 25 2017 3:12 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్, నితిన్ల సినిమా మొదలైంది..! - Sakshi

పవన్, నితిన్ల సినిమా మొదలైంది..!

హీరోగా, రాజకీయనాయకుడిగా ఫుల్ బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాతగానూ మారిన సంగతి తెలిసిందే.

హీరోగా, రాజకీయనాయకుడిగా ఫుల్ బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాతగానూ మారిన సంగతి తెలిసిందే. తన వీరాభిమాని నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి పవన్ ఒక సినిమా నిర్మిస్తున్నాడు. చాలా రోజుల క్రితమే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా, నితిన్ లై షూటింగ్లో బిజీగా ఉండటంతో సెట్స్ మీదకు రాలేదు. లై సినిమా షూటింగ్ పూర్తి కావంటతో నితిన్ కొత్త సినిమా సోమవారం (24-07-2017) నాడు సెట్స్ మీదకు వచ్చింది.

హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లై ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. అదే సమయంలో తన కొత్త సినిమా షూటింగ్లో బిజీ కానున్నాడు నితిన్. రౌడీ ఫెలో ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ 50 రోజుల పాటు జరగనుంది. ఆ తరువాత అమెరికాలో మరో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement