‘మేగా.. కాదు మే..ఘ’ | Nithin Chal Mohan Ranga First Song | Sakshi
Sakshi News home page

Feb 24 2018 10:32 AM | Updated on Mar 22 2019 5:33 PM

Chal Mohan Ranga - Sakshi

‘ఛల్ మోహన్‌ రంగ’ మూవీ స్టిల్‌

‘లై’ సినిమాతో నిరాశపరిచిన నితిన్‌.. త్వరలో ఛల్‌ మోహన్‌ రంగ అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రౌడీఫెలో ఫేం కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, నితిన్‌ తండ్రి సుధాకర్‌ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను ప్రారంభించారు చిత్రయూనిట్‌.

ఇటీవల టీజర్‌ తో ఆకట్టుకున్న ‘ఛల్‌ మోహన్‌ రంగ’ యూనిట్‌ తాజాగా తొలిపాటను రిలీజ్ చేసింది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సరదా పాటగా రూపొందిన ‘గ..ఘ..మేఘ’ పాటను  రిలీజ్ చేశారు. రాహుల్‌ నంబియార్‌ ఆలపించిన ఈ గీతానికి కృష్ణకాంత్‌ సాహిత్యమందించారు. తమన్ సంగీత మందిస్తున్న సినిమాలో లై ఫేం మేఘా ఆకాష్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement