నిరోషా రీ ఎంట్రీ | Nirosha Re-entry | Sakshi
Sakshi News home page

నిరోషా రీ ఎంట్రీ

Mar 10 2014 3:26 AM | Updated on Sep 18 2019 2:56 PM

నిరోషా రీ ఎంట్రీ - Sakshi

నిరోషా రీ ఎంట్రీ

ఒకప్పుడు ఓహో అని ప్రకాశించిన హీరోయిన్లు కొంత గ్యాప్ తరువాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించడం అన్నది సర్వసాధారణమే.

 ఒకప్పుడు ఓహో అని ప్రకాశించిన హీరోయిన్లు కొంత గ్యాప్ తరువాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించడం అన్నది సర్వసాధారణమే. అలా మళ్లీ ముఖానికి రంగు వేసుకుంటున్న నటి నిరోషా. 20 ఏళ్ల క్రితం చిన్న పూవే మెల్లపేసు, సింధూరపూవే తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి పేరు గాంచారు. నటుడు రాంకీని వివాహం చేసుకున్న నిరోషా, కుట్ర పత్రికై చిత్రం 2000 సంవత్సరంలో తెరపైకి వచ్చింది. ఆ తరువాత ఆమె నటనకు దూరం అయ్యారు. ఆమె కాదు భర్త రాంకీ కూడా నటించడం మానేశారు. అలాంటిది రాంకీ మళ్లీ నటించడం మొదలెట్టారు. ఆ మధ్య విడుదలైన బిరియాని చిత్రంలో రాంకీ ముఖ్యభూమికను పోషించారు. నటి నిరోషా కూడా మళ్లీ నటించడానికి సిద్ధం అవ్వడం విశేషం. ప్రస్తుతం హాస్య కథా చిత్రంగా తెరకెక్కుతున్న పప్పాలిలో నిరోషా అతిథిగా మెరవనున్నారు. ఇందులో సెంథిల్, ఇషార్ హీరో హీరోయిన్లుగా నటించారు. రీ ఎంట్రీలో మంచి పాత్రలు పోషించాలని ఆశిస్తున్నట్లు నిరోషా తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement