పార్టీకి టైమ్‌ అయ్యింది | Nikhil's Kirrak Party Movie Release On March 16th | Sakshi
Sakshi News home page

పార్టీకి టైమ్‌ అయ్యింది

Mar 3 2018 12:37 AM | Updated on Mar 3 2018 12:37 AM

Nikhil's Kirrak Party Movie Release On March 16th - Sakshi

నిఖిల్, సిమ్రాన్‌

పార్టీకి డేట్‌ ఫిక్సైంది. ఆ పార్టీ ఏ రేంజ్‌లో ఉంటుందో తెలుసుకోవాలంటే మాత్రం థియేటర్‌కు వెళ్లాల్సిందే. నిఖిల్‌ హీరోగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏటీవీ బ్యానర్స్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం  ‘కిర్రాక్‌పార్టీ’. శరన్‌ కొప్పిశెట్టి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అజయ్‌ సుంకర, అభిషేక్‌ అగర్‌వాల్‌ సహ నిర్మాతలు. సంయుక్త హెగ్డే, సిమ్రాన్‌ కథానాయికలు. కన్నడ హిట్‌ ‘కిర్రిక్‌ పార్టీ’కి ఇది రీమేక్‌. ఈ సినిమాను ఈ నెల 16న రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

‘‘నిఖిల్‌ స్టైలిష్‌ మ్యాచో లుక్స్‌ చిత్రంపై అంచనాలను మరింత పెంచాయి. కాలేజీ క్యాంపస్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం ‘హ్యాపీడేస్‌’ తరహాలో నిఖిల్‌కు మరో విజయం అందిస్తుంది. ఆల్రెడీ టీజర్, సాంగ్స్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఈ చిత్రానికి దర్శకులు సుధీర్‌ వర్మ స్క్రీన్‌ప్లే అందించగా, దర్శకుడు చందూ మొండేటి మాటలు సమకూర్చారు’’ అని నిర్మాత తెలిపారు. ఈ సినిమాకు సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: కిషోర్‌ గరికిపాటి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement