పవర్ స్టార్ చేతుల మీదుగా టీజర్ లాంచ్ | Nikhil starer Shankarabaranam Teaser Launch by Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవర్ స్టార్ చేతుల మీదుగా టీజర్ లాంచ్

Oct 14 2015 11:35 AM | Updated on Mar 22 2019 5:33 PM

పవర్ స్టార్ చేతుల మీదుగా టీజర్ లాంచ్ - Sakshi

పవర్ స్టార్ చేతుల మీదుగా టీజర్ లాంచ్

స్వామి రారా, కార్తీకేయ, సూర్య వర్సెస్ సూర్య లాంటి వరుస సక్సెస్ల తరువాత నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'శంకరాభరణం'. సాఫ్ట్ టైటిల్ తో రూపొందుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో...

స్వామి రారా, కార్తీకేయ, సూర్య వర్సెస్ సూర్య లాంటి వరుస సక్సెస్ల తరువాత నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'శంకరాభరణం'. సాఫ్ట్ టైటిల్ తో రూపొందుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో నందిత హీరోయిన్గా నటిస్తుంది. ప్రముఖ రచయిత కోన వెంకట్ కథ స్క్రీన్ మాటలు అందించటంతో పాటు స్వయంగా తానే ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

దీపావళి కానుకగా రిలీజ్ అవుతున్న శంకరాభరణం ఫస్ట్ లుక్ టీజర్ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ చేతుల మీదు గబ్బర్సింగ్ సెట్ నుంచే శంకరాభరణం టీజర్ను లాంచ్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు ఉదయ్ నందనవనం దర్శకుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement