జోరు పెరిగింది

Nikesha Patel join in Arav Market Raja MBBS - Sakshi

‘పులి’ (2010) సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు నికిషా పటేల్‌. ఆ తర్వాత ‘ఓమ్‌ త్రీడీ (2013), అరకు రోడ్డులో(2016), గుంటూరు టాకీస్‌ (2017)’ సినిమాల్లో నటించారామె. కేవలం తెలుగు సినిమాలే కాదు. వీలైనప్పుడల్లా కన్నడ, తమిళ సినిమాలు చేస్తున్నారీ బ్యూటీ. తాజాగా కోలీవుడ్‌పై ఎక్కువ దృష్టి పెట్టినట్లున్నారు. జీవీప్రకాశ్, ఈషా రెబ్బా జంటగా ఎళిల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఓ లీడ్‌ రోల్‌ చేయడానికి ఇటీవల గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు నికిషా పటేల్‌. తాజాగా ‘మార్కెట్‌ రాజా: ఎమ్‌బీబీఎస్‌’ సినిమాలో కీలకపాత్ర చేస్తున్నారామె. ఆల్రెడీ షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు కూడా. ‘జర్నీ’ ఫేమ్‌ శరవణన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆరవ్, కావ్యాథాపర్‌ జంటగా నటిస్తున్నారు. రాధికా శరత్‌కుమార్, నాజర్‌ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాని ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేయాలనుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top