అమితాబ్‌ ట్వీట్‌.. మండిపడ్డ అభిమానులు | Netizens Comments Over Amitab Bachan Tweet | Sakshi
Sakshi News home page

అమితాబ్‌ ట్వీట్‌.. మండిపడ్డ అభిమానులు

Apr 26 2020 6:47 PM | Updated on Apr 26 2020 6:54 PM

Netizens Comments Over Amitab Bachan Tweet - Sakshi

బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌‌పై అభిమానులు మండిపడుతున్నారు. వివరాలు తెలుసుకోకుండా ఫన్నీగా ట్వీట్లు చేయకండంటూ సలహా ఇస్తున్నారు. శనివారం అమితాబ్‌ ఓ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో.. ‘‘  బ్రేకింగ్‌ న్యూస్‌.. మీరు నమ్ముతారా? నా రూములోకి ఓ గబ్బిలం వచ్చింది. అదీ మూడవ అంతస్తులోని నా డెన్‌లోకి. దాన్ని బయటకు వెళ్లగొట్టటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కరోనా నన్ను విడిచిపెట్టడం లేద’’ని అన్నారు. అమితాబ్‌ కామెడీగా ట్వీట్‌ చేసినప్పటికి కొందరు నెటిజన్లు మాత్రం కఠినంగానే స్పందిస్తున్నారు. ( వైరల్‌ ట్వీట్‌: బిగ్‌బీపై నెటిజన్ల ఫైర్‌ )

‘‘ గబ్బిలాలు హానికరం కావు. మనం వాటికి భయపడాల్సిన అవసరం లేదు. పేరు ప్రఖ్యాతలు గల మీలాంటి వ్యక్తులనుంచి ఇలాంటివి వినాల్సి రావటం బాధాకరం. అవి వైరస్‌ను అంటించవని దయచేసి అర్థం చేసుకోండి’’... ‘‘ఇది మంచి పద్దతి కాదు సార్‌! మీకు మిలియన్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. మనుషులకు ఆ వైరస్‌ ఎలా అంటుకుందో ఇప్పటి వరకు తెలియలేదు. గబ్బిలాలను అనుమానించాల్సిన విషయం కాదది. అవి పురుగుల్ని కంట్రోల్‌ చేసే జీవులు. దాన్ని ఇంట్లోకి రానివ్వండి’’ అంటూ కామెంట్లు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement